Top
logo

కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసిన ఎన్నికల సంఘం

కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసిన ఎన్నికల సంఘం
X
Highlights

ఇకపై ఓటు వేయాలంటే ఆధార్ కార్డుతో ఓటర్ ఐడీ అనుసంధానం తప్పనిసరి. ఈ మేరకు న్యాయశాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ...

ఇకపై ఓటు వేయాలంటే ఆధార్ కార్డుతో ఓటర్ ఐడీ అనుసంధానం తప్పనిసరి. ఈ మేరకు న్యాయశాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఓటర్ కార్డును అధార్ కార్డుతో అనుసంధానించాలి అంటే, 1950 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సవరించేందుకు చర్యలు చేపట్టాలని న్యాయ శాఖ‌కు రాసిన లేఖలో ఎన్నికల సంఘం పేర్కొంది. ఓటర్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానించడం వల్ల పెద్ద ఎత్తున బోగస్ ఓట్లను ఏరివేసేందుకు అవకాశం ఉందని లేఖలో పేర్కొంది.

2016లో మాజీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఏకే జ్యోతి సమయంలో ఆధార్ కార్డులతో ఓటర్ కార్డులను అనుసంధానించిన కేంద్ర ఎన్నికల సంఘం.. సుప్రీం కోర్టు జోక్యంతో తన ప్రతిపాదనను విరమించుకుంది. 2017 జులై లో ఓటర్ కార్డులను ఆధార్ తో అనుసంధానం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Next Story