logo

వివేక్ , పొంగులేటి దారెటు..?

వివేక్ , పొంగులేటి దారెటు..?
Highlights

పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ అంతర్మథనంలో పడ్డారు. తనకు టీఆర్‌ఎస్ తరఫున ఎంపీ టిక్కెట్టు రాకపోవడంతో నిరాశలో...

పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ అంతర్మథనంలో పడ్డారు. తనకు టీఆర్‌ఎస్ తరఫున ఎంపీ టిక్కెట్టు రాకపోవడంతో నిరాశలో ఉన్న ఆయన ప్రభుత్వ సలహాదారు పదవికి నిన్న రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో భేటీ అయ్యారు. అయితే, బీజేపీలో చేరతారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై మౌనంగా ఉన్న వివేక్ కార్యకర్తల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడతారని తెలుస్తోంది.

ఖమ్మంలో ఇవాళ టీఆర్‌ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరగనుంది. అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అయితే, ఎంపీ టిక్కెట్టు దక్కకపోవడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కూడా డుమ్మా కొట్టారు. దీంతో ఈ సమావేశానికి సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆహ్వానం అందలేదు. భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ఆయన ఇవాళ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.


లైవ్ టీవి


Share it
Top