Top
logo

టీఆర్ఎస్‌‌కు మాజీ ఎంపీ వివేక్‌ గుడ్‌బై

టీఆర్ఎస్‌‌కు మాజీ ఎంపీ వివేక్‌ గుడ్‌బై
X
Highlights

పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. నిన్న ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన...

పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. నిన్న ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన వివేక్‌ ఇవాళ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో చర్చించారు. టీఆర్ఎస్‌ నుంచి బయటకు రావడంతో తనకు స్వతంత్రం వచ్చినట్టుందని అన్నారు. ఎంపీ పదవి లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. అన్ని పార్టీల నుండి తనకు ఆహ్వానాలు ఉన్నాయని చెబుతున్న వివేక్‌ భవిష్యత్‌ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానన్నారు.


Next Story