చంద్రబాబును కలిసిన బీజేపీ నేత..హ‌స్తిన‌లో ఏం జరుగుతోంది..?

చంద్రబాబును కలిసిన బీజేపీ నేత..హ‌స్తిన‌లో ఏం జరుగుతోంది..?
x
Highlights

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సర్వత్ర తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నరేంద్ర మోదీ మరోసారి భారతదేశ ప్రధాని అవుతారా? లేక యూపీఏ విజయకేతనం ఎగురవేస్తుందా? అనేది సరిగ్గా...

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సర్వత్ర తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నరేంద్ర మోదీ మరోసారి భారతదేశ ప్రధాని అవుతారా? లేక యూపీఏ విజయకేతనం ఎగురవేస్తుందా? అనేది సరిగ్గా మరో మూడంటే మూడు రోజుల్లో తేలనుంది. కాగా ఎన్నికల కౌంటింగ్‌కు ముందు జాతీయ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. బీజేపీ వ్యతిరేక పక్షాలతో చంద్రబాబు వరుస సమావేశాలు జరుపుతూ హాట్‌టాపిక్‌గా మారారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఏపీ సీఎం చంద్రబాబును ఢిల్లీలో ఇవాళ కలిశారు. ఏపీ భవన్‌కు వెళ్లి చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిసిన ఆయన మళ్లీ మీరే అధికారంలోకి రావాలన్నారు.

బీజేపీయేతర పక్షాలను ఏకం చేయడంలో ఢిల్లీలో గత మూడురోజులుగా బిజీబిజీగా ఉన్న చంద్రబాబును బీజేపీ ఎమ్మెల్యే విష్ణకుమార్‌రాజు కలవడం చర్చనీయాంశమైంది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే విష్ణుకుమార్‌రాజు బీజేపీని వీడి సైకిలెక్కుతారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమతో కలవాల్సిందిగా విష్ణుకుమార్‌తో బీజేపీ పెద్దలు రాయబారం పంపారా? లేక విష్ణుకుమార్ రాజే టీడీపీకి చేరువయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారా? అని ఏపీ వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగుతోంది. మరో వైపు చంద్రబాబు రాహుల్ గాంధీతో పాటు అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ నేత శరద్ పవార్, శరద్ యాదవ్, అఖిలేశ్ యాదవ్, మాయావతితో సమావేశమయ్యారు. ఒకవేళ ఎన్డీయే కూటమి మ్యాజిక్ మార్క్ చేరకుంటే ప్రభుత్వ ఏర్పాటులో తటస్థ పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాలన్నింటికీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories