విశాఖ కిడ్నీ రాకెట్‌ విచారణ ముమ్మరం

విశాఖ కిడ్నీ రాకెట్‌  విచారణ ముమ్మరం
x
Highlights

విశాఖ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై విచారణ ముమ్మరమైంది. కలెక్టర్ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ బృందం రెండవ రోజు శ్రద్ధ హస్పిటల్స్‌లో తనిఖీలు చేసింది. జిల్లా...

విశాఖ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై విచారణ ముమ్మరమైంది. కలెక్టర్ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ బృందం రెండవ రోజు శ్రద్ధ హస్పిటల్స్‌లో తనిఖీలు చేసింది. జిల్లా వైద్య ,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తిరుపతిరావు, డీసీహెచ్ఎస్ నాయక్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్‌ ఆసుపత్రిలోని కీలక పత్రాలను పరిశీలించారు. మరో రెండు రోజుల పాటు విచారణ కొనసాగనుంది. ఆసుపత్రిలో ఇప్పటి వరకు జరిగిన ఆపరేషన్ల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది చెప్పిన వివరాలను నోట్ చేసుకుంది కమిటీ.

అంతేకాక కిడ్నీ దానం చేసిన వారి చిరునామాలు పరిశీలించారు. శ్రద్ధ ఆసుపత్రికి రెఫర్ చేసిన వివిధ ఆసుపత్రులు వివరాలను సేకరించారు. ఎలాంటి లావాదేవీలు జరిగాయి. ఆపరేషన్లల ఎటువంటి నిబంధనలు పాటించారన్న విషయమై ఆరా తీశారు. ఎంతమేరకు నిబంధనలు పాటించి ఆపరేషన్లు చేశారు. కిడ్నీ రాకెట్‌కు సంబంధించి ఎలాంటి వ్యక్తులతో వీరు డీల్ చేసుకున్నారన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎవరైనా దాతల నుంచి తీసుకున్నారా లేదా సేవా స్పూర్తితో ఎవరైనా దానం చేశారా అన్న దానిపై పరిశీలిస్తున్నారు.

గత పదేళ్ల నుంచి ఎలాంటి ఆపరేషన్లు జరిగాయన్న దానిపై వాకబు చేశారు. వీలైనన్నీ కోణాల్లో త్రిసభ్య కమిటీ సభ్యులు విచారణ చేపడుతున్నారు. ఇటు పోలీసుల నుంచి కూడా వివరాలు సేకరించేందుకు నిర్ణయించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హస్పిటల్ ఎండీ ప్రదీప్ మాత్రం పరారీలో ఉన్నారు. ఆయన దొరికిన తర్వాత మరింత కీలకమైన సమాచారం లభించే అవకాశం ఉంది. ఇటు పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. కిడ్నీ రాకెట్ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి కొద్ది రోజుల్లోగా కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామని కమిటీ సభ్యులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories