కేసీఆర్ దత్త గ్రామమైన మోతెలో సర్పంచ్‌, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు ఏకగ్రీవం

కేసీఆర్ దత్త గ్రామమైన మోతెలో సర్పంచ్‌, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు ఏకగ్రీవం
x
Highlights

సీఎం కేసీఆర్ దత్త గ్రామమైన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతేలో సర్పంచ్ ఎన్నిక ఎకగ్రీవమైంది. అంతేకాదు ఉప సర్పంచ్‌తో పాటు , వార్డు మెంబర్లను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం.

సీఎం కేసీఆర్ దత్త గ్రామమైన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతేలో సర్పంచ్ ఎన్నిక ఎకగ్రీవమైంది. అంతేకాదు ఉప సర్పంచ్‌తో పాటు , వార్డు మెంబర్లను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం. కేసీఆర్ దత్త గ్రామం కావడంతో పాటు గ్రామ అభివృద్ది దృష్ట్యా అందర్నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త గ్రామమైన మోతే గ్రామం సర్పంచ్ ఎన్నికల విషయంలో ఒక్కత్రాటిపై నిలిచింది. భీమగోని రజితను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా జరుగుతున్న గ్రామ పంచాయితీ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్న గ్రామస్థులు సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ గ్రామానికి భారీగా నిధులు వచ్చి గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని గ్రామ సర్పంచ్ భీమగోని రజిత ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ కోసం ఏకగ్రీవ తీర్మానం చేసిన నిజామాబాద్ జిల్లాలో కెసిఆర్ 2001లో ముడుపు కట్టారు. తెలంగాణ వస్తే ముడుపు విప్పుతానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ 2014లో మోతే గ్రామన్ని సందర్శించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య మోతే గ్రామంలో ముడుపు విప్పారు. ఈ విషయాలను గ్రామస్థులు గుర్తుచేసుకున్నారు.

మోతే తన స్వంత గ్రామమని తాను బతికి ఉన్నం కాలం మోతేను తన స్వగ్రామంగా చూసుకుంటానని కెసిఆర్ చెప్పారు. అటువంటి మోతే గ్రామం సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేసి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకునే ఆలోచనలో ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories