Top
logo

మమత విషయంలో కేసీఆర్ వైఖరిపై విజయశాంతి ఫైర్

మమత విషయంలో కేసీఆర్ వైఖరిపై విజయశాంతి ఫైర్
X
Highlights

పశ్చిమ బెంగాల్ సమస్యపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్ విజయశాంతి...

పశ్చిమ బెంగాల్ సమస్యపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్ విజయశాంతి ప్రశ్నించారు. కేసీఆర్ ది ఫెడరల్ ఫ‌్రంట్ కాదు ఫెడో ఫ్రంట్ అని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ పాలన గాలికి వదిలేసి హోమాలకు పరిమితమయ్యారని విమర్శించారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ మాటలతో జనాలను మోసం చేస్తున్నారని విజయశాంతి అన్నారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కుట్రలు జరిగాయని విజయశాంతి ఆరోపించారు. ఈవీఎంల ట్యాంపర్ జరిగాయన్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు పంచి ఓట్లు కొన్నారని ఆమె అన్నారు. రాబోయే ఎన్నికలు రాహుల్, మోదీ మధ్య జరిగేవే అని, ఎన్నికల్లో న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Next Story