మహేష్ బాబు సినిమాపై స్పందించిన విజయశాంతి ..

మహేష్ బాబు సినిమాపై స్పందించిన విజయశాంతి ..
x
Highlights

ఒకప్పుడు తెలుగు సినిమాలో లేడి అమితాబ్ గా పేరొందిన విజయశాంతి అ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. అ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సెటిల్ అయిపోయారు .. ఇప్పుడు...

ఒకప్పుడు తెలుగు సినిమాలో లేడి అమితాబ్ గా పేరొందిన విజయశాంతి అ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. అ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సెటిల్ అయిపోయారు .. ఇప్పుడు కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నారు .. అయితే ఆమె మళ్లీ సినిమాలకి మేకప్ వేసుకోడానికి రెడీ అయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి . అది మహేష్ బాబు కొత్త సినిమానేని వార్తలు ఉపు అందుకున్నాయి .. అయితే ఆమె దీనిపై మొదటిసారిగా ఫేస్ బుక్ ద్వారా స్పందించారు ..

"సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుబాకాంక్షలు. కిలాడి కృష్ణుడు సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాను. అలా 180 కి పైగా సినిమాలు చేశాను .. మళ్లీ 13 సంవత్సరాల తరవాత మహేష్ బాబు సినిమా తరవాత రీ ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు .. సినిమాల నుండి కొంత విరామం తీసుకున్నా మళ్లీ సినిమాల వైపు రావడం అనేది దైవ సంకల్పమో లేకా దీవించిన ప్రజల అభిమాన ప్రభావమో అని ఆమె అన్నారు . బాధ్యతతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం మాత్రమే నాకు తెలుసునని" ఆమె పేర్కొన్నారు ..

అయితే ఈ సినిమా కోసం విజయశాంతి ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తుంది . అ పాత్రని పట్టుబట్టి ఆమెతోనే చేయించాలని దర్శకనిర్మాతలు భావించడంతో ఆమె ఇంతా డిమాండ్ చేసారని తెలుస్తుంది ..


Show Full Article
Print Article
Next Story
More Stories