Top
logo

'చంద్రబాబు.. ఆ నల్లచొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి':వైసీపీ నేత విజయసాయిరెడ్డి

చంద్రబాబు..  ఆ నల్లచొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి:వైసీపీ నేత విజయసాయిరెడ్డి
X
Highlights

ఏపీకి అన్యాయం చేసిన కేంద్రం తీరును నిరసిస్తూ సీఎం చంద్రబాబు నల్ల చొక్కా ధరించి నిరసన తెలుతున్న విషయం...

ఏపీకి అన్యాయం చేసిన కేంద్రం తీరును నిరసిస్తూ సీఎం చంద్రబాబు నల్ల చొక్కా ధరించి నిరసన తెలుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ నల్ల చొక్కాలను చంద్రబాబు జాగ్రత్తగా దాచుకోవాలని, ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైతే, చంద్రబాబు ఈ నల్ల చొక్కాలు ధరించి ప్రజలపై నిరసన తెలపొచ్చని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.'నల్ల చొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి చంద్రం సారూ. రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇంత అన్యాయమైన తీర్పిచ్చారని ప్రజలకు నిరసన తెలపాలి గదా. బ్లాక్ షర్టులో అమావాస్య రాత్రి దొంగతనాలకు బయల్దేరే బందిపోట్లలా కనిపిస్తున్నారు మీ టీడీపీ తమ్ముళ్లు!'అంటూ ఎద్దేవా చేశారు.


Next Story