చలాన్లపై వీహెచ్‌ చిర్రుబుర్రు...తనదైన శైలిలో...

చలాన్లపై వీహెచ్‌ చిర్రుబుర్రు...తనదైన శైలిలో...
x
Highlights

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు స్టైలే వేరు. తనకు నచ్చకుంటే సొంతపార్టీ నేతలనే టార్గెట్ చేస్తారు. అధికార పార్టీపై ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు....

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు స్టైలే వేరు. తనకు నచ్చకుంటే సొంతపార్టీ నేతలనే టార్గెట్ చేస్తారు. అధికార పార్టీపై ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పుగా అనిపిస్తే ఎవ్వరినైనా నిలదీస్తాడు. ఈ సారి రాజకీయ నాయకులు కాకుండా ట్రాఫిక్ పోలీసులు వీహెచ్ బారినపడ్డారు.

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు రూటే వేరు. ఎవరైనా తప్పు చేస్తే మోహమాటం లేకుండా విమర్శించడం ఆయన సహజ నైజం. సొంత పార్టీ నాయకులు, విపక్ష నేతలు, అధికారులను కూడా ఆయన లెక్క చేయరు. నా దారి రహదారి అంటూ వెళ్లిపోతునే ఉంటారు. ఈ సారి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వీహెచ్ ఆగ్రహనికి గురయ్యారు. ఏజీ ఆఫీసు ముందు వాహనాలకు చలాన్లు రాస్తున్న పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. ఎర్రటి ఎండలో వాహనాదారులకు చలాన్లు రాయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ట్రాఫిక్ పోలీసులతో గొడవపడుతూనే వీహెచ్ ట్రాఫిక్ పోలీసులు ఆపిన 20 వాహనాలను విడిపించి అక్కడి నుంచి పంపించేశారు. నెలలో రెండు సార్లు చలాన్లు రాయాల్సింది పోయి ప్రతిరోజు చాలాన్లు వేయడం ఏమిటాని ప్రశ్నించారు. చలాన్ల మీద కాకుండా ట్రాఫిక్ కంట్రోల్ పై దృష్టి పెట్టాలని పోలీసులకు సూచిస్తూ వీహెచ్ వెళ్లిపోయారు.


Show Full Article
Print Article
Next Story
More Stories