Top
logo

ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు చేయడం అన్యాయం: వీహెచ్

ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు చేయడం అన్యాయం: వీహెచ్
Highlights

పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీలుపై అనర్హత వేటు పడింది. భూపతిరెడ్డి, రాములు నాయక్, యాదవరెడ్డి శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీలుపై అనర్హత వేటు పడింది. భూపతిరెడ్డి, రాములు నాయక్, యాదవరెడ్డి శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై కాంగ్రెస్ సినీయర్ నేత వీహెచ్ స్పందించారు. తెలంగాణ ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు చేయడం అన్యాయమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు. మొదట ఇచ్చిన ఫిర్యాదును పక్కన బెట్టి తాజాగా ఇచ్చిన ఫిర్యాదుపై ఎలా నిర్ణయం తీసుకుంటారని వీహెచ్ ప్రశ్నించారు. ఏకపక్ష నిర్ణయంతో మండలి నుంచి డిస్ క్వాలిపై చేశారన్నారు ఎమ్మెల్సీ రాములు నాయక్. గిరిజనుల హక్కుల గురించి మాట్లాడినందుకే అనర్హత వేటు వేశారని ఆరోపించారు. చట్టాన్ని అవహేళన చేసినట్టు ఎమ్మెల్సీలను డిస్ క్వాలిఫై చేశారన్నారు యాదవరెడ్డి. ప్రజాస్వామ్యానికి ఈరోజు చీకటి రోజన్నారు భూపతి రెడ్డి అన్నారు. అలాగే ఈ అంశంపై తప్పకుండా తాను కోర్టుకు వెళతనని, న్యాయపోరాటం చేస్తా అని భూపతి రెడ్డి హెచ్చరించారు.

Next Story