ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన ఫోటోను షేర్ చేసిన వెంకీ..

ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన ఫోటోను షేర్ చేసిన వెంకీ..
x
Highlights

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు .. ఈ సంవత్సరం f2 సినిమాతో అలరించిన వెంకీ మరో మల్టీ స్టారర్ సినిమాతో ప్రేక్షకుల...

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు .. ఈ సంవత్సరం f2 సినిమాతో అలరించిన వెంకీ మరో మల్టీ స్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు .. ఇందులో వెంకీతో నాగచైతన్య స్క్రీన్ షేర్ చేసుకోతున్నాడు .. ఈ సినిమాకి వెంకీ మామ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే .. ఉగాదికి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కూడా బాగా ఆకట్టుకుంది ..

అయితే నిన్న ప్రముఖ నిర్మాత స్వర్గీయ డాక్టర్ డి రామానాయుడి పుట్టిన రోజు సందర్భంగా ఓ అరుదైన చిత్రాన్ని వెంకీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. చిన్నప్పుడు నాగచైతన్యకు కేక్‌ తినిపిస్తున్న ఫొటోలో రామానాయుడు కూడా ఉన్నారు.

ప్రస్తుతం ఈ ఫొటో అభిమానులను అలరిస్తోంది. 'మీరు మాతో ఉంటే చాలు. మీ కలను మేము నిజం చేస్తాం నాన్న. మిమ్మల్ని కోల్పోవడమే మాకు అతి పెద్దలోటు. హ్యాపీ బర్త్‌డే' అంటూ వెంకటేశ్‌ పేర్కొన్నారు.వెంకీ మామ సినిమాకి దర్శకుడు బాబి .. ఈ సినిమాని సురేశ్‌ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై సురేశ్‌బాబు నిర్మిస్తున్నారు...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories