ప్రాణాలతో చెలగాటం..తప్పతాగి బస్సు నడుపుతోన్న ప్రైవేట్‌ ట్రావెల్స్ డ్రైవర్లు..

ప్రాణాలతో చెలగాటం..తప్పతాగి బస్సు నడుపుతోన్న ప్రైవేట్‌ ట్రావెల్స్ డ్రైవర్లు..
x
Highlights

ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కృష్ణా జిల్లా పొట్టిపాడు టోల్ గేట్ వద్ద రవాణాశాఖ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ...

ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కృష్ణా జిల్లా పొట్టిపాడు టోల్ గేట్ వద్ద రవాణాశాఖ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వరుణ్ ట్రావెల్స్‌కు చెందిన బస్ డ్రైవర్ తప్ప తాగి డ్రైవింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. గుంటూరు నుంచి విశాఖ వెళ్తుండగా తనిఖీలు నిర్వహించిన అధికారులు బస్సులో 40 మంది ఉన్నట్టు గుర్తించారు. అయితే డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడటంతో వేరే డ్రైవర్‌తో బస్సును పంపించివేశారు.

నిన్న కూడా కృష్ణా జిల్లా కంచికచర్ల దగ్గర నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు పీకలదాక మందు తాగి డ్రైవింగ్ చేస్తునట్టు గుర్తించారు. మద్యం మత్తులో బస్సులు నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీవెంకటపద్మావతి, జీవీఆర్ ట్రావెల్స్ , శ్రీకనకదుర్గ ట్రావెల్స్ పై కేసులు నమోదు చేశారు.

ప్రయాణికుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌ భద్రతపై మాత్రం దృష్టిపెట్టడం లేదు. ఫిట్‌నెస్‌ లేని బస్సులు, నైపుణ్యం లేని డ్రైవర్లతో బస్సులను నడిపిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌ యాజమాన్యాలు ఇప్పుడు మరింత బరితెగిస్తున్నాయి. మద్యం మత్తులో డ్రైవర్లు బస్సులను నడుపుతున్నా పట్టించుకోవడం లేదు. దాంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories