Top
logo

గులాబీ దళంలోకి వంటేరు..

గులాబీ దళంలోకి వంటేరు..
Highlights

కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకే తాను టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు.

కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకే తాను టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. దళారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు నేరుగా చేరుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ముఖ్య మంత్రి వెంటే ఉన్నారని, కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి అన్నారు. తాను నేను పదవుల కోసం ఎప్పుడూ పనిచేయలేదు, ఎప్పుడూ ప్రజల పక్షానే పోరాటం చేశాను అని స్ఫష్టం చేశారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తాను పనిచేస్తాని వంటేరు అన్నారు.

Next Story


లైవ్ టీవి