రేవంత్‌ ఇంట్లో వాస్తు మార్పులు... ఎన్నికల్లో గెలుపు కోసమేనా ?

రేవంత్‌ ఇంట్లో వాస్తు మార్పులు... ఎన్నికల్లో గెలుపు కోసమేనా ?
x
Highlights

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్. ఈ ఫైర్ బ్రాండ్ ఈ మధ్యలో ఏది కూడా కలిసి రావడంలేదు. గత 2014 ఎన్నికల్లో టీడీపీ శాసనసభ్యుడిగా గెలుపొందిన రేవంత్...

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్. ఈ ఫైర్ బ్రాండ్ ఈ మధ్యలో ఏది కూడా కలిసి రావడంలేదు. గత 2014 ఎన్నికల్లో టీడీపీ శాసనసభ్యుడిగా గెలుపొందిన రేవంత్ రెడ్డి. కొద్ది రోజులకే ఓటుకు నోటు కేసులో బొక్కబోర్లపడిన విషయం తెలిసిందే, కాగా తెలంగాణలో టీడీపీ పని అయిపోతుందేమో అని మెళ్లిగా టీడీపీ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు రేవంత్ రెడ్డి. తరువాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్అ భ్యర్థిగా రేవంత్ రెడ్డి ఎన్నికల బరిలో దిగారు. ముచ్చటగా మూడోసారి కూడా గెలుపుతనదే అనుకున్న రేవంత్ రెడ్డికి ఉహించని షాక్ఇచ్చారు కొడంగల్ ప్రజలు. రేవంత్ ‎ఓటమితో కొన్ని రోజులుగా ఎవరికి కనబడకుండా దూరంగా ఉన్నాడు. మీడియా ముందుకు రానే రాను శపథం కూడా చేశారు. అయితే ఇది ఇలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అంటే ఘోరంగా ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఈ సారి మాత్రం పక్క వ్యూహాంతో మాల్కాజ్‌గిరి లోక్‌సభ అభ్యర్థిగా ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నారు రేవంత్ రెడ్డి. ఈసారి ఎలాగైన ఎంపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని రేవంత్ రెడ్డి వ్యూహాలకు ప్రతివ్వూహాలు రచిస్తున్నాడు రేవంత్.

ఇప్పటికే రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. మల్కాజిగిరి మీని భారత్ దేశం అన్ని అతి పెద్ద మల్కాజిగిరి నియోజకవర్గం అన్నారు. ఈ ఎన్నికల్లో ఉప ప్రాంతీయ పార్టీ లకు ఓట్లు వేసిన లభం లేదన్నారు. మొన్నటి వరకు ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్న మల్లారెడ్డి ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదన్నారు. అయితే పనిలో పనిగా రేవంత్ రెడ్డి ఇంటి వాస్తుపై కన్నుపడిందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా కొంతకాలంగా తనకు ఎదురవుతున్న కష్టాలు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణం తన ఇంటి వాస్తు సక్కగా లేకపోవడమే కారణమని భావిస్తున్న రేవంత్ రెడ్డి తాజాగా ఇంటి వాస్తుకు సంబంధించి చిన్న చిన్న మార్పులు చేపడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నివసిస్తున్న జూబ్లీ హిల్స్‌లోని నివాసం నివాసానికి సంబంధించిన గేటును దక్షిణం నుంచి తూర్పు దిశగా మార్చారని సమాచారం. గేటు మార్పు, ఇంట్లో చిన్న చిన్న వాస్తు మార్పులు జరుతున్నాయని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. తనకు కలిసిరాకపోవడం కేవలం వాస్తు కారణంగానే ఈ మార్పులు చేపడుతున్నట్టు కొందరు చర్చించుకుంటున్నారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే కొన్ని కొన్ని విషయాలను కూడా రేవంత్ రెడ్డిపట్టించుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి రేవంత్ ఇంట్లో వాస్తు మార్పుతో ఈ ఎన్నికల్లోనైనా గెలుస్తాడో లేదో వేచి చూడాలి మరి!

Show Full Article
Print Article
Next Story
More Stories