తెలంగాణలో ఉపఎన్నిక.. బరిలో ఉత్తమ్ సతీమణి పద్మావతి?

తెలంగాణలో ఉపఎన్నిక.. బరిలో ఉత్తమ్ సతీమణి పద్మావతి?
x
Highlights

తెలంగాణలో త్వరలో ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ పార్లమెంటు ఎంపిగా విజయం సాధించడంతో ఆయన...

తెలంగాణలో త్వరలో ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ పార్లమెంటు ఎంపిగా విజయం సాధించడంతో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్న హుజూర్ నగర్ శాసనసభ స్థానం ఖాళీ కానుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలను అధికార టీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోంటున్నాయి.

త్వరలో తెలంగాణలో ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ స్థానానికి పోటీ చేసి విజయం సాదించారు. ప్రస్తుతం హూజూర్ నగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఉత్తమ్ఎం పీగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో త్వరలో హూజూర్ నగర్ శాసన సభ స్థానానికి ఉప ఎన్నికలు రానున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల నుంచి మిశ్రమ స్పందన రావడంతో టీఆర్ ఎస్, కాంగ్రెస్ , బీజేపీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ తన సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతిని పోటీ చేయించాలని యోచిస్తున్నారు. పద్మావతిని మళ్లీ ఎమ్మెల్యేను చేసేందుకు ప్లాన్ ప్రకారం పార్లమెంట్ కు ఉత్తమ్ పోటీ చేశారని గాంధీ భవన్ లో ప్రచారం జరుగుతోంది. నల్గొండ పార్లమెంట్ సీటును కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో హుజూర్ నగర్ మళ్లీ కాంగ్రెస్ దక్కేలా హస్తం నాయకులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ఫ తేడాతో హుజూర్ నగర్ సీటును అధికార టీఆర్ ఎస్ చేజార్చుకుంది. ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. హూజూర్ నగర్ సీటును గెలిచి నల్గొండ జిల్లాలో టీఆర్ ఎస్ పట్టుకోల్పోలేదని నిరూపించుకోవాలని టిఆర్ఎస్ చూస్తోంది. ఇక అనూహ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ హుజూర్ నగర్ ఉప ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటుంది. గట్టి అభ్యర్థి కోసం అన్వేషిస్తుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో మరోసారి సత్తా చాటాలని టీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పట్టుదలగా ఉన్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories