ఆ మహానుభావుడిని తాకే అర్హత వారికి లేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఆ మహానుభావుడిని తాకే అర్హత వారికి లేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
x
Highlights

హైదరాబాద్‌లోని పంజాగుట్ట సర్కిల్‌లో ఏర్పాటు చేసిన డా. అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించడమే కాకుండా చెత్త కుప్పలో పడేయడంపై రాష్ట్రవ్యాప్తంగా బహుజన సంఘాలు,...

హైదరాబాద్‌లోని పంజాగుట్ట సర్కిల్‌లో ఏర్పాటు చేసిన డా. అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించడమే కాకుండా చెత్త కుప్పలో పడేయడంపై రాష్ట్రవ్యాప్తంగా బహుజన సంఘాలు, ప్రజాసంఘల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కాగా ఆదివారం ఉదయం నుంచి పంజాగుట్టకు భారీగా చేరుకున్న బహుజన సంఘాలు విగ్రహ తొలగింపుకు నిరసనగా అక్కడ నడి రోడ్డుపై బైఠాయించాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంబేడ్కర్ విగ్రహ తొలగింపుపై స్పందించారు.

ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం, రాజ్యాంగం ఏదీ పనిచేయదని ఒక నియంతం రాజ్యం నడుస్తోందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. కాగా మేధావులు మౌనంగా ఉంటే సమాజానికి చెడు జరుగుతుందని, అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చేసి చెత్త డంపింగ్‌ యార్డ్‌లో పడేసినా కూడా సమాజంలో స్పందన రాకపోతే ఇంత నిస్తేజంగా ఉంటే రాజ్యం ఎలా నడుస్తుందని నిలదీశారు. అయితే దళిత సీఎం హామీ ఇచ్చి కల్వకుంట చంద్రశేఖర్ కేసీఆర్ ఆ మాట నిలుపుకోలేదని కానీ కాంగ్రెస్ పార్టీ దళిత నేతను సీఎల్పీగా చేస్తే మాత్రం టీఆర్ఎస్ భరించలేక రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను నిర్లజ్జగా ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ నాయకులకు అసలు డా. అంబేడ్కర్ మహానుభావుడిని తాకే అర్హత లేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories