నిన్నకరక్కాయ.. నేడు పల్లీ నూనే..

నిన్నకరక్కాయ.. నేడు పల్లీ నూనే..
x
Highlights

నిన్నకరక్కాయ నేడు పల్లీ నూనే. కరక్కాయల పొడి మోసం మరిచిపోక ముందే హైదరాబాద్ లో ఇప్పుడు మరో మోసం వెలుగులోకి వచ్చింది.

నిన్నకరక్కాయ నేడు పల్లీ నూనే. కరక్కాయల పొడి మోసం మరిచిపోక ముందే హైదరాబాద్ లో ఇప్పుడు మరో మోసం వెలుగులోకి వచ్చింది. మల్టీలెవల్ బిజినెస్ పేరుతో ఎటా పలు మోసాలు బయటపడుతున్నా జనంలో మార్పు రావడం లేదు. ఘరాన మోసగాళ్లు చెబుతున్న మాయమాటలను నమ్మి, అడ్డంగా బుక్ అవుతున్నారు.

హైదరాబాద్‌లో మరో మల్టీలెవల్ మోసం వెలుగులోకి వచ్చింది. నాగోల్‌లో గ్రీన్‌గోల్డ్ బయోటెక్ పేరుతో ఏర్పాటు చేసిన ఎంఎల్‌ఎం కంపెనీ మోసాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. గ్రీన్‌గోల్డ్ బయోటెక్ ఎండీ శ్రీకాంత్‌, కరక్కాయల పొడి తరహాలోనే వేరుశనగ గింజల నుంచి నూనె తీసే మిషన్లు ఇస్తామంటూ వేలాది మందిని నమ్మించి డబ్బు వసూలు చేశాడు. బాధితుల పిర్యాదుతో శ్రీకాంత్‌ను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

లక్ష రూపాయలు చెల్లిస్తే చాలు పల్లీలు తీసే మిషన్ ను ఇస్తామంటూ శ్రీకాంత్ చాలామందిని నమ్మించాడు. నెల నెలా భారీగా డబ్బు సంపాదించవచ్చని ఆశచూపాడు. అతని మాయమాటలు నమ్మిన వారి నుంచి 50 కోట్ల నుంచి వంద కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నాలుగు రాష్ర్టాలకు చెందిన వారిని మోసం చేసినట్లు కంపెనీపై ఆరోపణలు వచ్చాయి. గతంలో మహాలైఫ్ పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్‌ను శ్రీకాంత్ నడిపాడు. బాధితుల ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్ పోలీసలు నిందితుడు శ్రీకాంత్‌‌, అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories