ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చినా కూటమి ఏర్పాటులో చంద్రబాబు బీజీ

ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చినా కూటమి ఏర్పాటులో చంద్రబాబు బీజీ
x
Highlights

ఎగ్జిట్‌ పోల్స్‌ ఎలా ఉన్నా కూటమి ఏర్పాటులో మాత్రం చంద్రబాబు వెనుకంజ వేయడం లేదు. గత శనివారం నుంచి వరుస భేటీలతో హీట్ పెంచిన చంద్రబాబు.. ఇవాళ కూడా...

ఎగ్జిట్‌ పోల్స్‌ ఎలా ఉన్నా కూటమి ఏర్పాటులో మాత్రం చంద్రబాబు వెనుకంజ వేయడం లేదు. గత శనివారం నుంచి వరుస భేటీలతో హీట్ పెంచిన చంద్రబాబు.. ఇవాళ కూడా ఢిల్లీలో బీజేపీ యేతర పార్టీల సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో 21 పార్టీల ప్రతినిధులు పాల్గొంటారని చెబుతున్నారు. వీరి భేటీలో ముఖ్యంగా ఫలితాల తర్వాత అనుసరించే వ్యూహంపై చర్చిస్తారు. బీజేపీని ఒంటరి చేయడం.. మిగతా రాజకీయ పక్షాలను ఏకం చేయడమే లక్ష్యంగా మంతనాలు సాగిస్తారు. ఆ తర్వాత వీరంతా కలిసి ఈ మధ్యాహ్నం ఈసీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తారు.

నిన్న మధ్యాహ్నమే అమరావతి నుంచి కోల్‌కత్తా వెళ్లిన చంద్రబాబు మమతా బెనర్జీతో కీలక మంతనాలు సాగించారు. ఇతర పార్టీల నేతలతో జరిపిన చర్చల సారంతో పాటు ఫలితాల తర్వాత అనుసరించే వ్యూహాన్ని చర్చించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే సోనియాగాంధీ, రాహుల్, అఖిలేశ్, మమత, శరద్ పవార్, మాయావతి, అఖిలేష్‌ వంటి నేతలను కలిసిన చంద్రబాబు ఫలితాల అనంతర పరిస్థితులపై చర్చించారు. అలాగే ఈ మధ్యాహ్నం కూడా చంద్రబాబు నేతృత్వంలో బీజేపీయేతర పార్టీల సమావేశం జరుగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories