ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికకు పోటీ అనేది ఉండదు...1964 నుంచి వరుసగా ఏకగ్రీవం

Adilabad
x
Adilabad
Highlights

ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికకు పోటీ అనేది ఉండదు. 1964 నుంచి వరుసగా ఏకగ్రీవంగా ఎన్నికవుతోంది. మున్సిపాలిటీని తీసిపోకుండా అభివృద్ధితో పోటీ పడుతోంది ఆదిలాబాద్ జిల్లాలోని బరంపూర్ గ్రామం.

ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికకు పోటీ అనేది ఉండదు. 1964 నుంచి వరుసగా ఏకగ్రీవంగా ఎన్నికవుతోంది. మున్సిపాలిటీని తీసిపోకుండా అభివృద్ధితో పోటీ పడుతోంది ఆదిలాబాద్ జిల్లాలోని బరంపూర్ గ్రామం.

సర్పంచ్ పదవి కోసం పోటా పోటీ పడుతుంటారు. సర్వశక్తులు ఒడ్డి గెలువాలనుకుంటారు. ఎన్నికైతే చాలు పదవితో పైసలు సంపాదించుకోవచ్చని భావిస్తారు. కాని ఆదిలాబాద్ జిల్లా బరంపూర్ గ్రామ పంచాయతీ మాత్రం ఇందుకు భిన్నం. ఇక్కడ సర్పంచ్ పదవంటే అదో గౌరవం... అదో ఆశయం.... సంకల్పం.

1964లో ఏర్పడిన బరంపూర్ గ్రామ పంచాయతీ ఇప్పటి వరకు ఏకగ్రీవంగా ఎన్నికవుతూనే వస్తోంది. మొదటి సర్పంచ్ గా ఏనుగు భూమన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1968 నుండి 1987 వరకు వరుసగా నాలుగుసార్లు ముడుపు భూమారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతిపల్లి ఆశన్న, మెస్రం సోమన్న, మెస్రం రాము, సిడాం లస్మన్ లు సర్పంచ్ లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

బరంపూర్ గ్రామంలో భిన్న మతాలు, భిన్నకులాలు ఉన్నాయి. కానీ ఐక్యతే వారి మంత్రం. లింగ , వయస్సు భేదం లేకుండా అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. వారి ఐక్యతే గ్రామాభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంది. ఒకప్పుడు గ్రామానికి రోడ్డు లేక తొమ్మిది కిలోమీటర్లు నడిచి ఆదిలాబాద్ చేరుకునే వారు. ఇప్పుడు ఆ గ్రామం నుండి బయటకు వెళ్లడానికి రోడ్లు నిర్మించుకున్నారు. గ్రామంలో అంతర్గత రోడ్లు మున్సిపాలిటీని తలపిస్తున్నాయి. గుడి నుండి బడి వరకు గ్రామస్తులు సమష్టి కృషి నిర్మించుకున్నారు. గ్రామంలో సోలార్ తో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఉంది. ఇదంతా సర్పంచ్ లు ఏకగ్రీవం కావడం వల్ల సాధ్యమైందని గ్రామ సర్పంచ్ భూమరెడ్డి అన్నారు.

ఈసారి సర్పంచ్ పదవి ఎస్టీకి రిజర్వు చేశారు. అదే స్ఫూర్తితో ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని ఏకగ్రీవం చేయడానికి గ్రామస్తులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అన్ని గ్రామాలు బరంపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధికి బాటలు వేసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories