సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తొలిసారి...

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తొలిసారి...
x
Highlights

శబరిమల ఆలయ ప్రవేశంపై మహిళల పంతం నెగ్గింది. 50ఏళ్ల కన్న తక్కువ వయసు ఉన్న ఇద్దరు మహిళలు శబరిమల ఆలయ ప్రవేశం చేశారు. అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత 50ఏళ్ల లోపు మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకోవడం ఇదే తొలిసారి. దీంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి, సంప్రోక్షణ చేపట్టారు.

శబరిమల ఆలయ ప్రవేశంపై మహిళల పంతం నెగ్గింది. 50ఏళ్ల కన్న తక్కువ వయసు ఉన్న ఇద్దరు మహిళలు శబరిమల ఆలయ ప్రవేశం చేశారు. అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత 50ఏళ్ల లోపు మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకోవడం ఇదే తొలిసారి. దీంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి, సంప్రోక్షణ చేపట్టారు. శబరిమల చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మొదటిసారి ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించారు. అయ్యప్పను దర్శించుకున్న వారిని బిందు, కనకదుర్గగా గుర్తించారు. ఇవాళ తెల్లవారుజామున 3గంటల 45 నిమిషాల ప్రాంతంలో శబరిమల చేరుకున్న వీరిద్దరు అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు.కోజికోడ్‌ జిల్లాకు చెందిన బిందు, కనకదుర్గ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో పంబకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఎలాంటి పోలీసు భద్రత లేకుండానే సన్నిదానానికి వచ్చారని తెలుస్తోంది. అక్కడి

నుంచి 18 మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. నల్లని దుస్తులు ధరించి ఎవరికి అనుమానం రాకుండా సాధారణ భక్తుల్లానే దర్శనానికి వెళ్లారు. ఈ ఇద్దరు మహిళలు దర్శనానికి వచ్చిన సమయలో కొండపై కొందరు భక్తులు ఉన్నప్పటికీ ఎవరూ వీరిని ప్రశ్నించలేదు. సివిల్ డ్రస్సులో ఉన్న కొందరు పోలీసులు రక్షణగా ఉండటంతో ఎలాంటి ఉద్రిక్తలు లేకుండా స్వామివారిని దర్శించుకున్నారు.అనంతరం, దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ప్రధాన అర్చకుల ఆదేశాలతో శబరిమల ద్వారాలను తాత్కాలికంగా మూసివేశారు. ఆలయ సంప్రోక్షణ చేపట్టారు.

శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50ఏళ్ల మహిళలు ప్రవేశించకుండా దశబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ గతేడాది సెప్టెంబరు 28న సుప్పీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అయితే కోర్టు తీర్పు తర్వాత శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి మహిళా సంఘాలు ఎంత ప్రయత్నించినా అయ్యప్పను దర్శించుకోలేకపోయారు. భక్తల నుంచి తీవ్ర నిరసనలు ఎదురుకావడంతో పాటు ఆలయపరిసరాల్లో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. డిసెంబరు 18న బిందు, కనకదుర్గలు అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించగా, భక్తులు అడ్డుకోవడంతో పోలీసులు వీరిని వెనక్కి పంపించారు. ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించడం ద్వారా మహిళా శక్తి ఏంటన్న విషయం మరోసారి ప్రపంచానికి తెలిసి వచ్చిందన్నారు భూమాతా బ్రిగేడ్ కార్యకర్త తృప్తీ దేశాయ్.మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్టు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ధ్రువీకరించారు. 50ఏళ్ల లోపు మహిళలు ఇద్దరు ఆలయాన్ని దర్శించుకున్నారనేది నిజమన్నారు. అయ్యప్ప దర్శనం చేసుకునేందుకు వచ్చే మహిళలకు మరింత భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories