టీవీ9 సీఈవోగా తొలగించడంపై....రవిప్రకాష్ బహిరంగ లేఖ....

టీవీ9 సీఈవోగా తొలగించడంపై....రవిప్రకాష్ బహిరంగ లేఖ....
x
Highlights

టీవీ9 సీఈవోగా ఉన్న రవిప్రకాష్‌‌ను కొత్త యాజమాన్యం తొలగించింది. ఆయన స్థానంలో మహేందర్ర మిశ్రా నియమితులయ్యారు. కొత్త సీఈవోగా వచ్చిన మిశ్రా ప్రస్తుతం టీవీ...

టీవీ9 సీఈవోగా ఉన్న రవిప్రకాష్‌‌ను కొత్త యాజమాన్యం తొలగించింది. ఆయన స్థానంలో మహేందర్ర మిశ్రా నియమితులయ్యారు. కొత్త సీఈవోగా వచ్చిన మిశ్రా ప్రస్తుతం టీవీ 9 కన్నడ ఛానల్‌కు ఎడిటర్, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రస్తుతం టెన్‌ టీవీ సీఈవోగా ఉన్న గొట్టిపాటి సింగారావును సీవోవోగా నియమిస్తూ అలందా మీడియా బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. తాము కంపెనీని ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటే అవరోధాలు సృష్టించారని, 90.5శాతం తమకే అధికారం ఉందని ఏబీసీఎల్ డైరెక్టర్ సాంబశివరావు చెప్పారు. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు. సీఈవోగా రవిప్రకాష్‌ను తొలగించిన నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ రాశారు. మీరెన్ని అక్రమాలు, అన్యాయాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా నేను మీ సాటి షేర్ హోల్డర్‌గా, సంస్థలో నా వాటాకు ప్రతినిధిగా మీ పక్కనే ఉంటాను. దేశంలో జర్నలిజాన్ని కాపాడటానికి, పాత్రికేయ విలువల్ని రక్షించడానికి మీడియా సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని నిలువరించటానికి నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని రవిప్రకాష్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories