మే 14 నుంచి తిరుమలలో కారీరిష్ఠి యాగం.. ఎందుకంటే?

మే 14 నుంచి తిరుమలలో కారీరిష్ఠి యాగం.. ఎందుకంటే?
x
Highlights

కారీరిష్టి యాగానికి టీటీడీ ముస్తాబైంది. వర్షాల కోసం చేపట్టిన యాగానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న యాగానికి సర్వం...

కారీరిష్టి యాగానికి టీటీడీ ముస్తాబైంది. వర్షాల కోసం చేపట్టిన యాగానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న యాగానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. మహానిష్టాతులైన పండితులతో శాస్రోక్తంగా యాగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. కొండపై జరుగుతున్న యాగ ఏర్పాట్లపై స్పెషల్‌ స్టోరీ

విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రంతో పాటు దేశమంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ వరుణదేవుడి అనుగ్రహం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ యాగం నిర్వహిస్తోంది. ఈనెల 14 నుంచి 18 వరకు ఈ యాగం నిర్వహించనున్నారు. మహానిష్టాతులైన పండితులతో గోగర్భ తీర్థం వద్ద వరుణయాగం, శ్రీవరాహస్వామి వారి ఆలయంలో ఋష్యశృంగ శ్లోకాలు, ఆస్థానం మండపంలో మహాభారతంలోని విరాటపర్వం పారాయణం చేయనున్నారు. ప్రముఖ కళాకారులతో నాదనీరాజనం వేదికపై అమృతవర్షిణి రాగ ఆలాపన కార్యక్రమాలను ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు.

తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో మే 14 నుంచి 18 వరకు ఐదు రోజుల పాటు వరుణజపం చేయనున్నారు. టీటీడీ, కంచి కామకోఠి పీఠం సంయుక్తంగా నిర్వహించనుంది. వేద, శ్రౌత, స్మార్థ పండితులు ఈ యాగాలను శాస్రోక్తంగా నిర్వహించనున్నారు. యాగానికి సంబంధించి ఏర్పాట్లు టీటీడీ వైభవంగా జరుగుతున్నాయి.

అష్టదిక్పాలకులు, ఇంద్రాది సమస్త దేవతలను శాంతింపజేసి కరుణించేలా కారీరిష్ఠియాగాన్ని నిర్వహిస్తోంది. సాధారణంగా యాగకర్త, రుత్వికులు శ్వేత వస్త్రాలను ధరించి హోమాలు నిర్వహించడం అనవాయితీ. అయితే వీటికి భిన్నంగా కారీరిష్ఠి యాగంలో నల్లని దుస్తులను ధరించడంతో పాటు నల్లని వస్తువులకు ప్రాధాన్యత ఇస్తారు. మేఘాలను ఆకర్షించి కుంభవృష్టి వర్షం కురిసేలా అనుగ్రహించాలని వేదమంత్రాలతో పూజిస్తారు. యాగశాల ప్రాంగణంలో నల్లని మేక, గుర్రాన్ని ఉంచి వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories