logo

కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ బోర్డు

టీటీడీ పాలకమండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి ఆలయ ఆగమ సలహామండలి సభ్యులుగా అనంతశయ్య దీక్షితులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

TTD Board MeetingTTD Board Meeting

టీటీడీ పాలకమండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి ఆలయ ఆగమ సలహామండలి సభ్యులుగా అనంతశయ్య దీక్షితులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అలిపిరి దగ్గర 67.9 కోట్లతో 346 గదులు నిర్మాణం, భద్రత పర్యవేక్షణకు 15 కోట్లతో 1,050 సీసీ కెమెరాల ఏర్పాటు, అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 27.29 కోట్లు కేటాయింపు, ఏటీసీ వద్ద క్యూ లైన్ నిర్మాణానికి 17.21 కోట్లు కేటాయింపు, తిరుమలలో స్మార్ట్ డేటా ఏర్పాటుకు 2.63 కోట్లు, ఏజెన్సీల్లో ఆలయాలు నిర్మించాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అలాగే, పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరంలో ఆలయాల నిర్మాణం, పలమనేరులో గోశాల అభివృద్ధికి 40 కోట్లు.. అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం దగ్గర 2.27 కోట్ల వ్యయంతో కళ్యాణమండపం నిర్మాణానికి టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది.

లైవ్ టీవి

Share it
Top