గ్రూప్‌–2కు తొలగిన అడ్డంకులు

గ్రూప్‌–2కు తొలగిన అడ్డంకులు
x
Highlights

తెలంగాణలో గ్రూప్-2 అభ్యర్ధులకు ఊరట లభించింది. గ్రూప్-2 పోస్టుల ఎంపిక ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోస్టులకు ఎంపిక ప్రక్రియ...

తెలంగాణలో గ్రూప్-2 అభ్యర్ధులకు ఊరట లభించింది. గ్రూప్-2 పోస్టుల ఎంపిక ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోస్టులకు ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. గ్రూప్-2 పోస్టుల నియామక ప్రక్రియకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. తీర్పులో భాగంగా ఎంపిక ప్రక్రియలో బబ్లింగ్, వైట్‌నర్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని సాంకేతిక కమిటీ సిఫార్సుతో ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

గ్రూప్-2 పరీక్షలో బబ్లింగ్, వైట్‌నర్ వివాదం కారణంగా అభ్యర్థులను 343 మంది అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ ఎంపిక జాబితా నుంచి గతంలో తొలగించింది. అయితే జాబితా నుంచి తొలగించిన 343 మంది అభ్యర్థుల పత్రాలను పునర్‌సమీక్షించి, ఎంపిక ప్రక్రియలో వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని టీఎస్‌పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. దీంతో తదుపరి ఎంపిక ప్రక్రియలో వారికి అవకాశం దక్కనుంది. గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే 3,147 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన పూర్తికాగా.. తాజా తీర్పు నేపథ్యంలో 1 : 2 నిష్పత్తిలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

హైకోర్ట్ ఉత్తర్వులును తాము స్వాగతిస్తున్నామని TSPSC తెలిపింది. మొత్తం 1032 పోస్టులకుగాను 1 : 3 నిష్పత్తిలో 3,147మంది అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపిక కాగా, వారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలని ఆదేశించడం తో 1 : 2 నిష్పత్తిలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వయించునున్నారు. ఇక రెండు మూడు రోజుల్లో ఇంటర్ వ్యూల తేదీలు వెల్లడిస్తామని కోర్ట్ కి తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories