నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపాక ఉభయ సభలు నిరవధిక వాయిదా పడనున్నాయి. ధన్యవాద తీర్మానంపై మాట్లాడనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి రాబోయే ఐదేళ్లలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరించనున్నారు.

గవర్నర్ ప్రసంగానికి తెలంగాణ అసెంబ్లీ ధన్యవాదాలు తెలపనుంది. ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టాక మొదటగా టీఆర్‌ఎస్‌ సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మాట్లాడనున్నారు. అనంతరం పలువురు సభ్యులు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. చివరిగా మాట్లాడనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా వివరించనున్నారు. అలాగే రాబోయే ఐదేళ్లలో చేపట్టబోయే పథకాలు, అభివృద్ధి పనులు, ప్రాధాన్యతలను తెలియజేయనున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రకటన చేయనున్నారు.

గవర్నర్‌ ప్రసంగం అభివృద్ధికి అద్దం పట్టిందన్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. గతంలో గవర్నర్ ప్రసంగిస్తుంటే అడ్డుకున్న సందర్భాలున్నాయని, కానీ ఇప్పుడు సభ మొత్తం శ్రద్ధగా విందన్నారు.కాంగ్రెస్‌, బీజేపీ సభ్యులు మాత్రం గవర్నర్‌ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదన్నారు. కొత్తసీసాలో పాత సారాలా ఉందని విమర్శించారు. 17న కొత్త ఎమ్మెల్యేల ప్రమాణాలతో మొదలైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఆమోదం తెలిపాక ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories