భారత్‌కు ట్రంప్‌ వాణిజ్య దెబ్బ

భారత్‌కు ట్రంప్‌ వాణిజ్య దెబ్బ
x
Highlights

భారత్‌లోపై అమెరికా కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇన్నాళ్లు మనదేశానికి కల్పించిన ప్రాధాన్య వాణిజ్య హోదాను రద్దు చేస్తున్నట్లు ట్రంప్‌ సర్కారు...

భారత్‌లోపై అమెరికా కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇన్నాళ్లు మనదేశానికి కల్పించిన ప్రాధాన్య వాణిజ్య హోదాను రద్దు చేస్తున్నట్లు ట్రంప్‌ సర్కారు ప్రకటించింది. ఇది ఈ నెల 5 వ తేదీ నుంచే అమల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగేలా అమెరికా సర్కారు కీలక నిర్ణయం తీసకుంది. ఇన్నాళ్లూ మనదేశ ఎగుమతులకు ఇస్తున్న పన్ను రాయితీని రద్దు చేసినట్లు అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఈ నెల 5 వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయంతో అమెరికాకు జరుగుతున్న సుమారు 39 వేల కోట్ల ఎగుమతులపై రాయితీలు రద్దు కానున్నాయి.

అమెరికా అమలు చేస్తున్న జీఎస్పీ కింద 1976 నుంచి భారత్‌ లబ్దిదారుగా ఉంది. అయితే అమెరికా ఉత్పత్తులపై భారత్‌ మార్కెట్‌లో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే కారణంతో ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నట్లు అగ్రరాజ్యం పేర్కొంది. ముఖ్యంగా డెయిరీ, వైద్య పరికరాల ఉత్పత్తులపై గరిష్ట ధరలు నిర్ణయించి నియంత్రిస్తున్నారని ఆరోపించింది. అందుకే జీఎస్పీ కింద భారత్‌కు కల్పిస్తున్న సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే ట్రంప్ నిర్ణయంపై స్సందించిన భారత్, హోదాను రద్దు చేసినప్పటికీ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల బలోపేతానికి అమెరికాతో కలిసి పని చేస్తామని వెల్లడించింది. ఆర్థిక సంబంధాల్లో సమస్యలు వస్తుంటాయని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటామని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories