Top
logo

ఘోర రోడ్డు ప్రమాదం: 26 మంది సజీవ దహనం

ఘోర రోడ్డు ప్రమాదం: 26 మంది సజీవ దహనం
X
Highlights

పాకిస్థాన్ లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో దాదాపు 27మంది అక్కడికక్కడే చనిపోగా మరో 12 మందికి తీవ్రగాయాలపాలయ్యారు. బలూచిస్థాన్ లోని హబ్ ప్రాంతంలో ఇంధనం లోడ్ చేసుకొని వెళ్తన్న ట్రక్కును ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పాకిస్థాన్ లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో దాదాపు 27మంది అక్కడికక్కడే చనిపోగా మరో 12 మందికి తీవ్రగాయాలపాలయ్యారు. బలూచిస్థాన్ లోని హబ్ ప్రాంతంలో ఇంధనం లోడ్ చేసుకొని వెళ్తన్న ట్రక్కును ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీ నుంచి పంజ్ గురకు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సును అతి వేగంగా వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 27 మంది అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. హుటాహుటినా ఘటనస్థాలికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు.

Next Story