గ్లోబరీనా సంస్థపై స్పందించిన కేటీఆర్..

గ్లోబరీనా సంస్థపై స్పందించిన కేటీఆర్..
x
Highlights

ఇంటర్మీడియట్ రిజల్ట్స్‌పై జరగుతున్న లొల్లి అంత ఇంత కాదు. అర్హత లేని గ్లోబరీనా సంస్థకు రిజల్ట్స్ బాధ్యత అప్పగించడం వల్లే ఇదంతా జరిగిందన్న ప్రచారం...

ఇంటర్మీడియట్ రిజల్ట్స్‌పై జరగుతున్న లొల్లి అంత ఇంత కాదు. అర్హత లేని గ్లోబరీనా సంస్థకు రిజల్ట్స్ బాధ్యత అప్పగించడం వల్లే ఇదంతా జరిగిందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే ఈ గ్లోబరీనా సంస్థకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు ఉందన్న ఆరోపణలు కూడా వినిపించాయి. తనపై వస్తున్న ఆరోపణలపై కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై మీ స్పందనేంటి సర్‌? అని అడిగాడు దీనికి కేటీఆర్‌ స్పందిస్తూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ నివేదిక ప్రకారం తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎలాంటి రాజ్యాంగ హోదా లేని మీరు ప్రభుత్వ కార్యకలాపాల్లో కల్పించుకోవడాన్ని హక్కుగా భావిస్తున్నారా.? అన్న దానికి కేటీఆర్ దీనికి జవాబిస్తూ నేనొక ప్రజా ప్రతినిధిని. కాబట్టి అధికారులను కోరే అవకాశం ఉంది.గ్లోబరీనా సంస్థ విషయంలో మీరు వినిపిస్తుంది మీరే మంటారు? దానిక కేటీఆర్ అసలు గ్లోబరినా ఎవరిదో కూడా తెలియదు. ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాకనే దాని గురించి తెలిసిందన్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో తప్పులు దొర్లినట్లు త్రిసభ్య కమిటీ తేల్చిందని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి నిన్న స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ ఫలితాల్లో తప్పుకు ప్రధాన కారణంగా పబ్లికేషన్ తో తేడా జరిగినట్టు కమిటీ గుర్తించిందని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బోర్డు, ఏజెన్సీ, ఇతర విభాగాలకు చెందిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరో వైపు ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రతిపక్షాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయి. రేపు అనగా 29న ఇంటర్ బోర్దు వద్ద ధర్నా చేయనున్నాయి. త్రిసభ్య కమిటీ రిపోర్టు అందిన తర్వాత కూడా ప్రభుత్వం ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోకపోవడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories