యశ్‌ నటనకు కేటీఆర్‌‌ ఫిదా!

యశ్‌ నటనకు కేటీఆర్‌‌ ఫిదా!
x
Highlights

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సినిమా ప్రియుడనే సంగ‌తి తెలిసిందే. ఆయన ఖాళీ సమయాల్లో సినిమాలు చూస్తూ, వాటి గురించి ట్విట‌ర్ ద్వారా...

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సినిమా ప్రియుడనే సంగ‌తి తెలిసిందే. ఆయన ఖాళీ సమయాల్లో సినిమాలు చూస్తూ, వాటి గురించి ట్విట‌ర్ ద్వారా స్పందిస్తుంటారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల‌తో బిజీ అయిపోయి సినిమాలు చూడ‌లేక‌పోయిన‌ కేటీఆర్ తాజాగా ఓ సినిమా గురించి ట్వీట్ చేశారు. ద‌క్షిణాదిన `బాహుబ‌లి` త‌ర్వాత ఆ స్థాయి భారీ బ‌డ్జెట్‌తో నిర్మిత‌మై ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం `కేజీఎఫ్‌`. క‌న్న‌డ రాక్ స్టార్ య‌ష్ న‌టించిన ఈ సినిమా ద‌క్షిణాది భాష‌లన్నింటిలోనూ విడుద‌లై విజ‌యం సాధించింది. తాజాగా ఆ సినిమా చూసిన కేటీఆర్ ట్విట‌ర్ ద్వారా చిత్ర‌బృందాన్ని ప్రశంసించారు. `కొద్దిగా ఆల‌స్యంగానే అయినా ఎట్ట‌కేల‌కు `కేజీఎఫ్‌` చూశాను. సినిమా అద్భుతంగా ఉంది. సాంకేతికంగా, క‌థాప‌రంగా చాలా బాగుంది. ప‌ట్టుస‌డ‌ల‌ని స్క్రీన్‌ప్లేతో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ సినిమాను అద్భుతంగా రూపొందించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. స్క్రీన్‌ఫై రాక్‌స్టార్ య‌ష్ న‌ట‌న అదిరిపోయింద‌`ని కేటీఆర్ ట్వీట్ చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories