కొడంగల్‌లో చెల్లని ఓ రూపాయి మల్కాజిగిరిలో చెల్లుతుందా?: కేటీఆర్

కొడంగల్‌లో చెల్లని ఓ రూపాయి మల్కాజిగిరిలో చెల్లుతుందా?: కేటీఆర్
x
Highlights

దేశంలో ప్రస్తుతం మోడీ వేడి తగ్గిందని, కాంగ్రెస్‌ పుంజుకునే స్థితిలో లేదన్నారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. దేశమంతటా తెలంగాణ పే చర్చ...

దేశంలో ప్రస్తుతం మోడీ వేడి తగ్గిందని, కాంగ్రెస్‌ పుంజుకునే స్థితిలో లేదన్నారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. దేశమంతటా తెలంగాణ పే చర్చ రైతుబంధు పే చర్చ, మిషన్‌ భగీరథ పే చర్చ మొత్తం కేసీఆర్‌ పే చర్చ షురూ అయ్యిందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రె‌స్‌ను గెలిపిస్తే రాహుల్‌ గాంధీకి, బీజేపీ ఓటేస్తే మోడీకి లాభమని కానీ 16 మంది టీఆర్‌ఎస్‌ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు లాభమని కేటీఆర్‌ వివరించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఒక్క అభ్యర్థి దొరుకలేదని, కొండంగల్‌లో ఓడిపోయిన వ్యక్తిని తెచ్చారంటూ కొడంగల్‌లో చెల్లని ఓ రూపాయి మల్కాజిగిరిలో చెల్లుతుందా? అని ఎద్దేవాచేశారు. 40 ఏండ్లక్రితం తన నాయనమ్మ నినాదమైన గరీబీ హఠావో పేరుతో తానే ఈ దేశానికి టేకేదార్ అంటూ ఓ వైపు రాహుల్, ఐదేండ్లు అధికారంలో ఉండి దేశానికీ ఏమీచేయని మోదీ తానే ఈ దేశానికి చౌకీదార్‌నంటూ గారడీ మాటలతో ప్రజలముందుకు వస్తున్నారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories