Top
logo

జిల్లా, మండల్ పరిషత్ ఎన్నికలకు కేటీఆర్ సన్నాహాలు

జిల్లా, మండల్ పరిషత్ ఎన్నికలకు కేటీఆర్ సన్నాహాలు
Highlights

పరిషత్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ కసరత్తు మొదలు పెట్టింది. టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. పార్టీ ప్రధాన...

పరిషత్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ కసరత్తు మొదలు పెట్టింది. టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం అయ్యారు. హైదరాబాద్ టీఆర్ఎస్ భవన్‌లో జరుగుతున్న భేటీలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలను ఎదుర్కోవలసిన వ్యూహంపై చర్చిస్తున్నారు. అలాగే ఈ నెల 15న టీఆర్ఎస్‌ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించాలని కూడా కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ కార్యవర్గ సమావేశానికి ముందే పార్టీ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమావేశం అయ్యి చర్చిస్తున్నారు. లోక్ సభ పోలింగ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వచ్చేనెల లోపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తి చేసుకుంటే వచ్చే నాలుగేండ్లలో ఎలాంటి అటంకాలు ఉండవని టీఆర్ఎస్ భావిస్తోంది. మొత్తం తెలంగాణలో 535జడ్పీటీసీలు, 587 ఎంపీటీసీ పదవులు ఉన్నాయి. 32 జడ్పీచైర్మన్ లు ఉన్నాయి.

Next Story