కారు క్లీన్ స్వీప్...జిల్లాలకు జిల్లాలనే...

కారు క్లీన్ స్వీప్...జిల్లాలకు జిల్లాలనే...
x
Highlights

తెలంగాణలో పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 32 స్థానాలకు గాను 32 స్థానాల్లో గులాబీ జెండా ఎగిరింది. కారు స్పీడును విపక్షాలు...

తెలంగాణలో పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 32 స్థానాలకు గాను 32 స్థానాల్లో గులాబీ జెండా ఎగిరింది. కారు స్పీడును విపక్షాలు ఆపలేకపోయాయి. మొత్తం జడ్పీ పీఠాలన్నీ టీఆర్ఎస్ వశం కావడంతో గులాబీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు

తెలంగాణ పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గులాబీ జోరు కొనసాగింది. అన్ని జిల్లాల్లోను టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యతతో దూసుకెళ్లింది. మొత్తం 32 జిల్లా పరిషత్ లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నిజామాబాద్‌, కామారెడ్డి జెడ్పీలపై టీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం తర్వాత అదే జోరు పరిషత్ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని భావించారు అయినా కమలానికి వచ్చిన సీట్లు మూడు శాతానికి మించలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ప్రభావం చూపలేదు.

నిజామాబాద్ జిల్లాలో 27 జెడ్పీ టీసీలకు టీఆర్ఎస్ 23 కైవసం చేసుకోగా బీజేపీ రెండు, కాంగ్రెస్ కు రెండు స్థానాలు దక్కాయి. కామారెడ్డి జిల్లాలో 22 జెడ్పీటీసీ స్థానాలకు గాను 14 టీఆర్ఎస్, ఎనిమిది కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. తొలిసారి కామారెడ్డి జిల్లా పరిషత్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లా పరిషత్ లు టీఆర్ఎస్ వశమయ్యాయి. కరీంనగర్ లో మొత్తం 15 జెడ్పీటీసీ లు టీఆర్ఎస్ గెలుచుకుంది. రాజన్న సిరిసిల్ల లో 12 జెడ్పీటీసీల్లో 11 టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటి కైవసం చేసుకుంది. పెద్దపల్లి లో 13 జెడ్పీటీసీలకు 11 టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు స్థానాలు సాధించింది. జగిత్యాల జిల్లాలో 18 జడ్పీటీసీలకు టీఆర్ఎస్ 17, కాంగ్రెస్ ఒక్క స్థానంలో గెలిచింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ టీఆర్ఎస్ హవా కొనసాగింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లా పరిషత్ లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లాలో మొత్తం 7, వరంగల్ రూరల్ జిల్లాలో మొత్తం 16, జనగామ జిల్లాలో మొత్తం 12 స్థానాలను టీఆర్ఎస్ చేజిక్కించుకుంది. భూపాలపల్లి జిల్లాలో 11 జెడ్పీటీసీలకు గాను టీఆర్ఎస్ 6, కాంగ్రెస్ నాలుగు, ఇతరులు ఒక స్థానం గెలుచుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 16 జడ్పీటీసీలకు 14 టీఆర్ఎస్, రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలుపొందారు. ములుగులో 8 స్థానాలకు టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ ఒక స్థానం కైవసం చేసుకుంది.

ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా పరిషత్ లపై గులాబీ జెండా రెపరెపలాడింది. సంగారెడ్డిలో 25 జెడ్పీటీసీలకు టీఆర్ఎస్ 20, కాంగ్రెస్ 5, మెదక్ జిల్లాలో 18 స్థానాల్లో టీఆర్ఎస్, రెండు స్థానాల్లో కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్ధులు గెలిచారు. సిద్దిపేట జిల్లాలో 23 జెడ్పీటీసీ స్థానాల్లో 22 టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటి గెలుచుకుంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ టీఆర్ఎస్ సత్తా చాటింది. నల్లగొండ జిల్లాలోని 23 జడ్పీటీసీలకు టీఆర్ఎస్ 23, కాంగ్రెస్ 9 స్థానాలు కైవసం చేసుకున్నాయి. సూర్యాపేట జిల్లాలో టీఆర్ఎస్ 19, కాంగ్రెస్ నాలుగు, యాదాద్రి జిల్లాలో 11 టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలుపొందింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 3, బీజేపీ నాలుగు జెడ్పీటీసీలు గెలుచుకున్నాయి. కొమురంభీం జిల్లాలో టీఆర్ఎస్ 14 జెడ్పీటీసీలు సాధించగా కాంగ్రెస్ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. నిర్మల్ లో 12 జెడ్పీటీసీలు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఐదు స్థానాల్లో గెలువగా ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. మంచిర్యాలలో జిల్లాలో 23 జడ్పీటీసీలకు టీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 4, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు.

రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ 15, కాంగ్రెస్ ఐదు జెడ్పీటీసీలు కైవసం చేసుకోగా ఒక స్థానం ఇతరులు గెలుచుకున్నారు. వికారాబాద్, మేడ్చల్ జిల్లా పరిషత్ లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి మహబూబా నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట. జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ టీఆర్ఎస్ హవా కొనసాగింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories