ఎమ్మెల్సీ ఎన్నికలపై కేసీఆర్‌ కసరత్తు! కేసీఆర్ మ‌దిలో ఉన్న ఆ ముగ్గురు?

ఎమ్మెల్సీ ఎన్నికలపై కేసీఆర్‌ కసరత్తు!  కేసీఆర్ మ‌దిలో ఉన్న ఆ ముగ్గురు?
x
Highlights

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నామినేష‌న్లు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో సీఎం కేసీఆర్ అభ్య‌ర్థుల ఎంపిక‌ కసరత్తును వేగవంతం చేశారు. ఎమ్మెల్సీ స్థానాలు గల మూడు...

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నామినేష‌న్లు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో సీఎం కేసీఆర్ అభ్య‌ర్థుల ఎంపిక‌ కసరత్తును వేగవంతం చేశారు. ఎమ్మెల్సీ స్థానాలు గల మూడు జిల్లాల మంత్రులతో మంత‌నాలు చేశారు. అభ్య‌ర్ధుల బ‌లబ‌లాలు సామాజిక స‌మీక‌ర‌ణ‌లు బేరీజు వేసుకుని జాబితాను సిద్ధం చేస్తున్నారు గులాబీ బాస్. వరంగ‌ల్ , రంగారెడ్డి, న‌ల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్తుల ఎంపిక‌పై టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎక్కువ‌మంది పోటీ ఆశావహులుఉండ‌టంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అభ్యర్థులు గెలుపు బాధ్యతను ఆయా జిల్లాల మంత్రులకు కేసీఆర్ అప్పగించారు.

మూడు ఎమ్మెల్సీ స్థానాలకు డ‌జ‌న్ కు పైగా ఆశావాహులు రేస్ లో ఉన్నారు. రంగారెడ్డి లోక‌ల్ బాడి ఎమ్మెల్సీ కోసం మాజీ మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి, క్యామ మ‌ల్లేష్ ఆశిస్తున్నారు. వీరిలో మ‌హేంద‌ర్ రెడ్డి కి టిక్కెట్ వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. న‌ల్గొండ నుంచి గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ఉమామాద‌వ రెడ్డి, తేరా చిన్న‌ప రెడ్డి, వేముల వీరేశం, శ‌శిధ‌ర్ రెడ్డి లు టికెట్ ఆశిస్తున్నారు. గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి కే అవ‌కాశాలు ఎక్కువగా ఉన్న‌ట్లు పార్టీలో చ‌ర్చ సాగుతోంది.

వ‌రంగ‌ల్ నుంచి మాజీ మంత్రి బ‌స్వ‌రాజు సార‌య్య, సీనియ‌ర్ నేత త‌క్కెళ్ల‌పల్లి ర‌వీంద‌ర్ రావు టికెట్ ఆశిస్తున్నారు. మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి కూడ ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. మ‌ధుసూద‌నా చారికి ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇస్తే శాస‌న‌మండలి చైర్మ‌న్ గా అవ‌కాశం క‌ల్పించే యోచ‌న‌లో పార్టీ అధినేత ఉన్న‌ట్లు తెలుస్తోంది. కేటీఆర్ కు అత్యంత స‌న్నిహితుడు గా పేరున్న పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా బ‌లంగా వినిపిస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఒకటి రెండో రోజుల్లో గులాబీ బాస్ ప్రకటించే అవకాశం ఉంది. కేసీఆర్ మ‌దిలో ఉన్న ఆ ముగ్గురు ఎవరన్న విష‌యం ఆశావాహుల్లో టెన్ష‌న్ రేపుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories