Top
logo

పార్ల‌మెంట్ ఎన్నిక‌లపై టీఆర్ఎస్ నజర్...16 ఎంపీ సీట్లే లక్ష్యంగా...

TRSTRS
Highlights

టార్గెట్ 16. ఇప్పుడు టీఆర్ఎస్ లక్ష్యం ఇదే. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌పై నజర్ పెట్టిన గులాబీ పార్టీ ఆ దిశగా ఇప్ప‌టినుంచే పావులు క‌దుపుతోంది. అందరికంటే ముందుగానే లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు సమాయత్తం అవుతోంది.

టార్గెట్ 16. ఇప్పుడు టీఆర్ఎస్ లక్ష్యం ఇదే. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌పై నజర్ పెట్టిన గులాబీ పార్టీ ఆ దిశగా ఇప్ప‌టినుంచే పావులు క‌దుపుతోంది. అందరికంటే ముందుగానే లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు సమాయత్తం అవుతోంది.

వరుసగా రెండో సారి అధికారం చేజిక్కించుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు పార్ల‌మెంట్ ఎన్నిక‌లపై దృష్టి పెట్టింది. మొత్తం 17 సీట్లకు గానూ 16 చోట్ల జ‌య‌కేత‌నం ఎగుర‌వేయాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది. 16 ఎంపీ సీట్లు గెలిస్తే కేంద్రంలో చ‌క్రం తిప్పే అవకాశం వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. మోడీ గ్రాఫ్ రాను రానూ పడిపోతుండడం కాంగ్రెస్‌కు కూడా వంద సీట్ల వరకే వస్తాయన్న అంచనాల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు ఈసారి కీలకంగా మారే అవకాశం ఉంది.అందుకే లోక్ సభ ఎన్నికలకు నాలుగు నెల‌ల స‌మ‌యం ఉన్నా 16 సీట్లలో గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎదురైన స‌మ‌స్య‌లు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పున‌రావృతం కాకుండా టీఆర్ఎస్ ఇప్ప‌టినుంచే జాగ్ర‌త్త‌లు తీసుకొంటోంది. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓటింగ్ తీరు, పోలైన ఓట్లు, టీఆర్ఎస్ అభ్య‌ర్ధికి ప‌డిన ఓట్లు, మెజార్టీపై ఫోక‌స్ పెట్టారు. లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో టీఆర్ఎస్‌కు వచ్చిన ఓట్ల‌పై లెక్క‌లు వేసుకుంటున్నారు. అలాగే ప్ర‌తిప‌క్ష పార్టీలు గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఓట‌మిపై విశ్లేషిస్తున్నారు. డివిజ‌న్లు, మండ‌లాలు, గ్రామాల వారీగా ఏయే వ‌ర్గాలు టీఆర్ఎస్ వైపు ఉన్నాయి ఏ వర్గాల ప్రజలు టీఆర్ఎస్‌కు దూర‌మ‌య్యార‌నే అంశంపై అధ్య‌య‌నం చేస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాపై టీఆర్ఎస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ఒకే సీటు రావడంతో ఆ ఓట‌మినే గుణ‌పాఠంగా ప్రణాళికలు రచిస్తోంది. ఖ‌మ్మం పార్ల‌మెంటు సీటును గెలవాలనే ప‌క్కా ప్లాన్‌తో ముందుకెళుతోంది.


లైవ్ టీవి


Share it
Top