Top
logo

ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు

ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు
Highlights

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును టీఆర్ఎస్ స్వాగతించింది.

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును టీఆర్ఎస్ స్వాగతించింది.సమ్మిళిత వృద్ధి, బలమైన సమాజ నిర్మాణం కోసం జరిగే ప్రతి ప్రయత్నాన్ని టీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందని ఎంపీ జితేందర్ స్పష్టం చేశారు. ఈబీసీ కోటా వల్ల పేదలకు మేలు జరుగుతుంద్న టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి 10 శాతం రిజర్వేషన్లతో సమస్య పరిష్కారం కాదన్నారు. తెలంగాణలో ముస్లింలకు 12 శాతం , ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు పెంచాలని యోచించామని అయితే ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఆమోదించలేదని గుర్తు చేశారు. తమిళనాడులో రిజర్వేషన్లు 69 శాతం ఉంటే మిగతా చోట్ల 50 శాతం లోపే ఉన్నాయన్నారు. దేశం మొత్తం ఒకే చట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలని జితేందర్ రెడ్డి కోరారు. తెలంగాణలో ముస్లిం ,ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచేందుకు కేంద్రం అంగీకరించాలని జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story

లైవ్ టీవి


Share it