16 ఎంపీ సీట్లు గెలవాలి : కేటీఆర్

16 ఎంపీ సీట్లు గెలవాలి : కేటీఆర్
x
Highlights

కరీంనగర్‌‌ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి హాజరైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ ‌నుంచి కరీంనగర్ చేరుకున్న...

కరీంనగర్‌‌ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి హాజరైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ ‌నుంచి కరీంనగర్ చేరుకున్న ఆయనకు అల్గునూర్ చౌరస్తా దగ్గర స్ధానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీతో కరీంనగర్‌లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా రోడ్డు పొడవునా పూలు జల్లుతూ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు గెలవాల్సిందేన్ననారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు, 50 శాతం ఓట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లో సుమారు 70మంది ఎంపీలు ఉండబోతున్నారని చెప్పారు. ఢిల్లీలో ఏర్పాటు చేసే ప్రభుత్వంలో 16మంది ఎంపీలు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. అలాగే సీఎం కేసీఆర్ పాలన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 42లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. కరీంనగర్‌ జిల్లాలోని శ్రీరాజరాజేశ్వరీ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన కరీంనగర్‌ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories