టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌ పార్టీతో మైండ్‌గేమ్...రోజుకొక కాంగ్రెస్ ఎమ్మెల్యే...

టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌ పార్టీతో మైండ్‌గేమ్...రోజుకొక కాంగ్రెస్ ఎమ్మెల్యే...
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌కు వరుస మీద వరుస షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు....

తెలంగాణ కాంగ్రెస్‌కు వరుస మీద వరుస షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. మరోవైపు కేటీఆర్ తో నిన్న మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ కు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇప్పటికే గుడ్ బై చెప్పారు. కారుకు ఎమ్మెల్యేలు క్యూ కట్టడంతో కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది.

పార్లమెంట్‌ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌ పార్టీతో మైండ్‌గేమ్ ఆడుతోంది. రోజుకొక కాంగ్రెస్ ఎమ్మెల్యేతో ఆ పార్టీకి రాజీనామా చేయిస్తోంది. మండలితో పాటు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టీఆర్ ఎస్ కాంగ్రెస్ ను దెబ్బ మీద దెబ్బ కొడుతోంది.

మెన్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. నిన్న ఉదయం కేటీఆర్‌తో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంట్లో కుమారుడు కార్తీక్ రెడ్డితో కలిసి ఆమె కేటీఆర్‌ను కలిశారు. తర్వాత ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కాంగ్రెస్‌ను వీడనున్నట్లు ప్రకటించింది.

సీనియర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ వీడుతారు అనే ప్రచారం కాంగ్రెస్ లో కలకలం రేపగా, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ టీఆర్ ఎస్ లో చేరుతుండడం సంచలనంగా మారింది. అవసరమైతే టీఆర్‌ఎస్ బీ ఫామ్‌పై పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. మహిళాదినోత్సవం నాడు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కాంగ్రెస్ ను వీడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. వారం రోజులకే ఆమె మాట మార్చారు. టీఆర్ ఎస్ లో చేరనున్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నాయకులు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories