logo

ప్రతిపక్షానికి హడలెత్తిస్తోన్న టీఆర్‌ఎస్...ఆకర్ష్ పథకంలో...

ప్రతిపక్షానికి హడలెత్తిస్తోన్న టీఆర్‌ఎస్...ఆకర్ష్ పథకంలో...
Highlights

తెలంగాణలో అధికార పార్టీ ఆకర్ష్‌తో ప్రధాన ప్రతిపక్షం హడలెత్తిపోతోంది. పార్టీ ముఖ్యనేతలకు షాక్ ఇస్తూ వారి ముఖ్య...

తెలంగాణలో అధికార పార్టీ ఆకర్ష్‌తో ప్రధాన ప్రతిపక్షం హడలెత్తిపోతోంది. పార్టీ ముఖ్యనేతలకు షాక్ ఇస్తూ వారి ముఖ్య అనుచరులను కారెక్కిస్తుండటం కాంగ్రెస్‌ నేతలకు మింగుడు పడటం లేదు. మొన్న డీకే అరుణ, నిన్న జానారెడ్డి, నేడు కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఇలా కాంగ్రెస్ ముఖ్య నేతలందరికి షాకిచ్చింది టీఆర్ఎస్.

నల్లగొండ జిల్లాలో కీలక నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్‌కి టీఆర్‌ఎస్ ఆకర్ష్ స్కీమ్ గట్టి షాకిచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్ టిక్కెట్టు కోసం అధిష్టానంతో ఢీకొట్టడానికి సిద్ధమయ్యారు కోమటిరెడ్డి బ్రదర్స్. అలాంటి వారినే ఖంగు తినిపించేలా లింగయ్యకు గాలం వేసింది టీఆర్ఎస్. ఆకర్ష్‌కు తలొంచిన లింగయ్య తాజాగా సీఎం కేసీఆర్‌ను కలిసి కారెక్కేందుకు రెడీ అయ్యారు.

గతంలో 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి డీకే అరుణ సొంత తమ్ముడు, మక్తల్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్‌రెడ్డిని కారెక్కించింది టీఆర్ఎస్ అధిష్టానం. మహబూబ్‌నగర్ జిల్లాలో అధికార పార్టీని ఆమె పదే, పదే టార్గెట్ చేయడంతో సొంత తమ్ముడిని కారెక్కించుకొని అరుణకు షాకిచ్చింది గులాబీ పార్టీ.

ఆ తర్వాత అప్పటి ప్రతిపక్ష నేత జానారెడ్డిని కూడా కోలుకోలేని దెబ్బతీసింది టీఆర్‌ఎస్. ఎన్నో ఏళ్లుగా జానారెడ్డిని నమ్ముకొని రాజకీయ జీవితాన్ని గడిపిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావును వ్యూహాత్మకంగా కారెక్కించారు. దీంతో జానారెడ్డికి దిమ్మతిరిగిందన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరిగింది.

ఎవరూ ఊహించని విధంగా ఒక్కొక్కరూ కాంగ్రెస్‌కు షాకిస్తుండటం ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మరి అధికార పార్టీ ఆకర్ష్ పథకానికి ఇంకెంతమంది కారెక్కుతారో చూడాలి.


లైవ్ టీవి


Share it
Top