టీఆర్ఎస్ ఎంపీల్లో ఆ ముగ్గురికి నో ఛాన్స్..?

టీఆర్ఎస్ ఎంపీల్లో ఆ ముగ్గురికి  నో ఛాన్స్..?
x
Highlights

టీఆర్ఎస్ లోక్ సభ సీట్ల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్ధుల ఎంపికపై టీఆర్ఎస్ అధినేత కసరత్తు చేశారు. ఇవాళ తొలిజాబితా విడుదల చేసే అవకాశాలున్నాయి....

టీఆర్ఎస్ లోక్ సభ సీట్ల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్ధుల ఎంపికపై టీఆర్ఎస్ అధినేత కసరత్తు చేశారు. ఇవాళ తొలిజాబితా విడుదల చేసే అవకాశాలున్నాయి. శుక్రవారం నాటికి లోక్ సభ అభ్యర్ధుల పూర్తి జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆరుగురు సిట్టింగ్ ఎంపీలకు తిరిగి అవకాశం ఇచ్చేందుకు గులాబీ బాస్ నిర్ణయించారు. వినోద్ కుమార్, కవిత, కొత్త ప్రభాకర్ రెడ్డి ,బీబీ పాటిల్, బూర నర్సయ్య గౌడ్, జి.నగేష్ లకు మళ్లీ పోటీ చేసే అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. సిట్టింగ్ ఎంపీలు జితేందర్ రెడ్డి, సీతారాం నాయక్, పొంగులేటి శ్రీనాస్ రెడ్డిలకు మళ్లీ అవకాశం కల్పించడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. వీరి స్థానాల్లో పలువురు పారిశ్రామిక వేత్తలు, సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. మరో వైపు మల్కాజ్ గిరి, చేవెళ్ల ,సికింద్రాబాద్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు ఇటు కేటీఆర్, అటు కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories