Top
logo

నా ప్రేమ మీవల్లే సక్సెస్‌ అయింది: బాల్క సుమన్‌

నా ప్రేమ మీవల్లే సక్సెస్‌ అయింది: బాల్క సుమన్‌
X
Highlights

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ గా పద్మారావు ఏకగ్రీవ ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు నామినేషన్‌ ...

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ గా పద్మారావు ఏకగ్రీవ ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు నామినేషన్‌ మాత్రమే దాఖలు కావడంతో ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు స్పీకర్ పోచారం ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన పద్మారావుకు సీఎం కేసీఆర్ తో పాటు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభలో బాల్క సుమన్ మాట్లాడుతూ.. పద్మారావుతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనవర్సిటీలో ఉన్న తమకు పజ్జన్నా పూర్తస్థాయిలో వెన్నుదన్నుగా నిలిచారు. ఆ సమయంలో తమకు తోడ్పాటు, సహకారాన్ని అందించి అండగా నిలిచారని గుర్తు చేశారు. 2012లో తన పెళ్లి చేసింది పద్మారావు అన్ననే అని తెలిపారు. తన అత్తమామ పెళ్లికి ఒప్పుకోకపోతే.. పద్మారావు అన్న పెద్దమనసుతో మూడు నెలల కాలంలో రెండు విడుతలుగా వారితో మాట్లాడి తమ ప్రేమ వివాహానికి ఒప్పించారని గుర్తు చేశారు. ఆ తర్వాత దగ్గరుండి పెళ్లి చేశారు. ఈ సందర్భంగా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

Next Story