Top
logo

కవిత స్వగ్రామంలో బీజేపీ అనూహ్య విజయం

కవిత స్వగ్రామంలో బీజేపీ అనూహ్య విజయం
X
Highlights

తెలంగాణలో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ దూసుకుపోతోంది. చాలా చోట్ల...

తెలంగాణలో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ దూసుకుపోతోంది. చాలా చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఎక్కువసంఖ్యలో ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక, పరిషత్‌ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితకు మరో షాక్ తగిలింది. ఆమె స్వగ్రామం పోతంగల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం పోతంగల్ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి రాజు 96 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ కవితకు చేదు ఫలితాలు ఎదురైన సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేతిలో భారీ మెజారిటీతో ఓటమిపాలయ్యారు. టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా భావించిన నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంతోపాటు కరీంనగర్‌ స్థానంలోనూ బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. లోక్‌సభ ఎన్నికల్లో కవితపై 179 మంది రైతులు పోటీ చేసి లోక్‌సభ ఎన్నికలు2019లో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

Next Story