కేటీఆర్, హరీష్ లకు మంత్రి వర్గంలో చోటు దక్కేనా..?

కేటీఆర్, హరీష్ లకు మంత్రి వర్గంలో చోటు దక్కేనా..?
x
Highlights

మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం దగ్గర పడటంతో ఇప్పుడు ఆ ఇద్దరి వైపే అందరి దృష్టి మళ్లింది. క్యాబెనెట్ బెర్తులు వారికి చోటు దక్కుతుందా లేక గులాబి బాస్...

మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం దగ్గర పడటంతో ఇప్పుడు ఆ ఇద్దరి వైపే అందరి దృష్టి మళ్లింది. క్యాబెనెట్ బెర్తులు వారికి చోటు దక్కుతుందా లేక గులాబి బాస్ వారికి వేరే బాధ్యతలు అప్పగిస్తారన్నది ఆసక్తిగా మారింది. అసలు ఆ ఇద్దరి విషయంలో గులాబి అధినేత వ్యూహమేంటనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.

రెండో సారి అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్ ఇప్పటి వరకూ పూర్తి స్థాయి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయలేదు సీఎంతో పాటు మహమూద్ అలీ మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు ఇక మిగతా మంత్రి వర్గ కూర్పుపై గత కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్నారు. దీనికోసం ముహూర్తం ఖరారు చేసుకున్నారు ఈనెల ఏడో తేదీన ఆరు లేదా ఎనిమిది మందితో కేబినెట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది ఇక కేబినెట్లో కొత్త ముఖాలకు చాన్స్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తునట్లు సమాచారం.

పార్టీ ఆవిర్భావం నుంచి హరీష్ రావు కేసీఆర్‌కు వెన్నంటే ఉన్నారు. ఉద్యమ సమయంనాటి నుంచి పార్టీ‌లో ట్రబుల్ షూటర్ గా పార్టీలో పేరుంది. ఎన్నికలల్లో టీఆర్ఎస్ విజయంలో కీలక పాత్ర హరీష్ పోషించారు దీంతో తాజాగా చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణలో హరీష్ రావుకు చోటు దక్కుతుందా లేదా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరోవైపు పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన పూర్తి వ్యవహారాలపై దృష్టి సారించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీ అధినేత కేసీఆర్. హరీష్‌రావు, కేటీఆర్‌లకు పలు కీలక నియోజక బాధ్యతలు అప్పగించారు. గులాబీ అధినేత తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ భారీ విజయం సాధించడంలో ఈ ఇద్దరూ ఎంతో కృషిచేశారు. గ్రేటర్ హైదరాబాద్ పై పూర్తి స్థాయిలో దృ ష్టి సారించిన కేటీఆర్ మోజారిటి స్థానాలు గెలుపొందడంలో క్రీయాశీలకంగా వ్యవహరించారు. ఇక గెలుపు కష్ట మనుకున్న స్థానాల్లో పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించారు హరీష్ రావు.. ముఖ్యంగా డీకే అరుణ, రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్శింహ లాంటి బలమైన నేతలను ఓడించడంలో కీలక పాత్ర పోషించారు.

జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల్లో 16 పార్లమెంటు స్థానాల్లో గెలిచేందుకు పావులు కదుపుతున్నారు. దీని కోసం హరీష్, కేటీఆర్‌ల సేవలు ఉపయోగించుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతలు వీరికి అప్పగిస్తారని సమాచారం అందుతోంది.. దీంతో తొలివిడుత మంత్రి వర్గ కూర్పులో ఈ ఇద్దరూ నేతలకు మంత్రి పదవులు ఇవ్వరనే చర్చ పార్టీలో జరుగుతోంది. మొత్తానికి పార్లమెంటు ఎన్నికల దృష్యా మంత్రి పదవులకు ఇస్తే ఇద్దరికీ ఇస్తారని.. లేకపోతే ఇద్దరికీ ఇవ్వరనే చర్చ నడుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories