Top
logo

గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ వ్యూహాం..

గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ వ్యూహాం..
X
Highlights

ఈనెల మార్చి 17న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని తనకు సెంటిమెంటల్ గా కలిసివచ్చిన...

ఈనెల మార్చి 17న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని తనకు సెంటిమెంటల్ గా కలిసివచ్చిన కరీంనగర్ నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ నేపధ్యంలో ఓవైపు ప్రచారసభను సక్సెస్ చేయడానికి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి రెండున్నర లక్షల మందిని సమీకరించేందుకు గ్రామాలు, మండలాల వారీగా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కులసంఘాల నేతలతో సమావేశమవుతుండగా మరోవైపు సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కరీంనగర్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో జరిగే సభకు సంబంధించిన ఏర్పాట్లను ఈరోజు మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్, ఎమ్మెల్యేలు రసమయి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పరిశీలించారు.

ఆతర్వాత మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. మార్చి 17న సీఎం కేసీఆర్ సభను సక్సెన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు సిఎం కేసీఆర్ ఏ పధకాలు ప్రారంభించినా కరీంనగర్నుంచే మొదలు పెట్టడం సెంటిమెంట్, అనవాయితీగా వస్తోందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. అందుకే పార్ల మెంట్ ఎన్నికల శంఖరావాన్ని సైతం కరీంనగర్ నుంచే ప్రారంభిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే ఒక ప్రాంతీయ పార్టీ రెండవసారి భారీగా ఎమ్మెల్యేలతోగెలుపొంది అధికారం చేపట్టిందంటే.. ఆ ఘనత కేసీఆర్ దీ, టీఆర్ఎస్ పార్టీదేనన్నారు మంత్రి ఈటెల రాజేందర్. పార్లమెంట్ లో, తెలంగాణ ఉద్యమంలో పోరాడిన, కొట్లాడిన ఉద్యమ నేత ఎంపి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరముందన్నారు ఈటెల.కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాలు స్వచ్ఛంద మద్దతును పలుకుతున్నాయని 17వ తేదిన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకుంటారన్నారాయన.సభకు 2 లక్షల 50 వేల మంది జనసమీకరణ చేసేందుకు కృషి చేస్తున్నామన్న ఈటెల తెలంగాణ దశ దిశ మార్చే సభగా కరీంనగర్ సభ కాబోతోందన్నారు. తెలంగాణా రాష్టంలో 16 ఎంపి సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన ఈటెల సభకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఆసౌకర్యం లేకుండా చూసుకుంటామన్నారు.

Next Story