ఏ ఎన్నికైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే: హరీశ్‌రావు

ఏ ఎన్నికైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే: హరీశ్‌రావు
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికైనా సరే టీఆర్ఎస్‌దే విజయమని సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు. సిద్ధిపేట జిల్లాలోని ఐదు...

తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికైనా సరే టీఆర్ఎస్‌దే విజయమని సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు. సిద్ధిపేట జిల్లాలోని ఐదు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ జెండా రేపరేపలాడించాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు హరీశ్‌ రావు పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేటలో టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికైనా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా పోటీ చేయాలనే ఆసక్తి చాలామందికి ఉంటుందని, కానీ పార్టీ నిర్ణయించిన వారికి మద్దతుగా నిలబడి గెలిపిస్తే అందరికి గౌరవం ఉంటుందని చెప్పారు. జిల్లాలోని అన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. సిద్దిపేట అంటేనే నమ్మకమైన కార్యకర్తలకు నిదర్శనం అని రుజువు చేయాలన్నారు. ఈ సమావేశంలో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్‌లు, అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories