ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు.. విధేయతకు పెద్దపీట వేసిన కేసీఆర్‌‌

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు.. విధేయతకు పెద్దపీట వేసిన కేసీఆర్‌‌
x
Highlights

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్ధులను టీఆర్ఎస్ ఖరారు చేసింది. రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాలో పార్టీ...

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్ధులను టీఆర్ఎస్ ఖరారు చేసింది. రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాలో పార్టీ సీనియర్ నేతలు, మంత్రులతో మంతనాలు జరిపిన తర్వాత అభ్యర్ధుల పేర్లను ఫైనల్ చేశారు సీఎం కేసీఆర్. రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్ రెడ్డి, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ నుంచి తేరా చిన్నపరెడ్డి పేర్లను అధిష్టానం ఖరారు చేసింది.

తెలంగాణలోని వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయనున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, నల్గొండ నుంచి తేరా చిన్నపరెడ్డి పేర్లను కేసీఆర్‌ ఖరారు చేశారు. ఈ మూడు జిల్లాలకు చెందిన పలువురు నేతలు కొండంత ఆశతో ప్రగతి భవన్ వైపు పరుగులు తీశారు. తమ అభ్యర్ధిత్వాలను పరిశీలించాలని లాబీయింగ్ చేశారు.

ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. పార్టీ బలాబలాలు పరిశీలించి అభ్యర్ధుల పేర్లను కేసీఆర్ కు సూచించారు. మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గతంలో రంగారెడ్డి నుంచే టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా పోటీచేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన శాసనస సభ ఎన్నికల్లోనూ కొడంగల్ నుంచి పోటీచేసి గెలుపొందడటంతో..అదే కుటుంబానికి చెందిన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తాండూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందిన మహేందర్ రెడ్డి ఎంపీ టికెట్ ఆశించారు.

ఇక నల్లగొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉమామాధవరెడ్డి, తేరా చిన్నపరెడ్డి, వేముల వీరేశం, శశిధర్ రెడ్డి, చందర్ రావు టికెట్ ఆశించారు. సుఖేందర్ రెడ్డి స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి విముఖత చూపడంతో చిన్నపరెడ్డికి అవకాశం ఇచ్చారు. వరంగల్ లోకల్ బాడీ స్థానం నుంచి అభ్యర్ధిగా ప్రకటించిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కేటీఆర్ కు సన్నిహితంగా ఉన్నారు. మాజీ మంత్రి బసరాజు సారయ్య, పార్టీ సీనియర్ నేత తక్కెళ్లపల్లి రవీందర్ రావు, గుండు సుధారాణి, మాజీ స్పీకర్ మధుసుధనాచారి ఎమ్మెల్సీ సీటు ఆశించారు. అయినా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వైపే మొగ్గు చూపారు సీఎం కేసీఆర్. మధుసూధనాచారిని రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చ జరుగుతోంది. మొత్తానికి పార్టీలో అనేక మంది నేతలు ఎమ్మెల్సీ టికెట్ ఆశించినా రాబోయో రోజుల్లో నామినేటెడ్ పదవులు కేటాయిస్తామంటూ సర్ధి చెప్పి అభ్యర్ధుల పేర్లను ప్రకటించి బీ- ఫారాలు అందచేశారు గులాబీ బాస్.


Show Full Article
Print Article
Next Story
More Stories