టీఆర్‌ఎస్ భ‌వ‌న్‌కు కొత్త హంగులు

Telangana Bhavan
x
Telangana Bhavan
Highlights

తెలంగాణ భ‌వ‌న్‌కు కొత్త హంగులు అద్దబోతున్నారు. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కేటీఆర్‌ పార్టీ కార్యాలయంపై త‌నదైన మార్క్ చూపేందుకు కార్య‌చ‌ర‌ణ రూపొందిస్తున్నారు. రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి ప్రజలు, నేతల రాక ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ భ‌వ‌న్‌కు కొత్త హంగులు అద్దబోతున్నారు. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కేటీఆర్‌ పార్టీ కార్యాలయంపై త‌నదైన మార్క్ చూపేందుకు కార్య‌చ‌ర‌ణ రూపొందిస్తున్నారు. రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి ప్రజలు, నేతల రాక ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు.

టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేటీఆర్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ భవన్‌కు కొత్త కళ వచ్చింది. టీఆర్ఎస్ ప్రధాన కార్యాయలంలో కేటీఆర్ నిత్యం అందుబాటులో ఉంటుండడంతో నిత్యం వంద‌లాది మంది నేతలు కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు వ‌చ్చి క‌లుస్తున్నారు. వచ్చీపోయే నేతలు, కార్యకర్తలు, ప్రజలతో నిత్యం తెలంగాణ భ‌వ‌న్ మినీ సెక్ర‌టేరియ‌ట్‌ను త‌ల‌పిస్తోంది.

రద్దీకి అనుగుణంగా తెలంగాణ భవన్‌లో మార్పులు చేర్పులు చేయాలని అధినాయకత్వం నిర్ణయించింది. వివిధ సమస్యలు విన్నవించుకోవడానికి వస్తున్న ప్రజలకోసం ఇప్పటికే గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. గ్రీవెన్స్ సెల్‌‌లో ప్రజలు ఇచ్చే విన‌తి ప‌త్రాల‌ను అక్కడి సిబ్బంది ప‌రిశీలించి శాఖ‌ల వారిగా ప‌ంపించి స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం చొర‌వ చూపుతారు. అలాగే తెలంగాణ భ‌వ‌న్‌లో పార్టీ ప్ర‌థాన కార్య‌ద‌ర్శుల‌కు ప్ర‌త్యేక గ‌దులు కేటాయిస్తున్నారు. కార్య‌క‌ర్త‌లు నేరుగా ప్ర‌ధాన కార్య‌ధ‌ర్శుల‌ను క‌లిసి వారి స‌మ‌స్య‌ల‌ను చెప్పుకునే వెసులుబాటు కూడా క‌ల్పిస్తున్నారు. అంతేకాదు తెలంగాణ భవన్‌లో కొత్త సాంకేతిక హంగులను అందుబాటులోకి తెస్తున్నారు. జిల్లా కార్యాల‌యాలన్నింటినీ హెడ్ ఆపీస్‌తో ఆన్ లైన్ ద్వారా అనుసంధానం చేయాలని నిర్ణయించారు. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా జిల్లా నేత‌ల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణ భ‌వ‌న్ ‌ను పార్కింగ్ సమస్య వేధిస్తోంది. పార్టీ సమావేశాలు జరిగినా ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించినా అక్కడి వచ్చే వాహనాలన్నీ రోడ్ల పక్కనే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం అవుతోంది. టీఆర్ఎస్ కార్యాలయం దగ్గర ట్రాఫిక్ స‌మ‌స్యను నివారించేందుకు ఆ భవంతి ముందున్న ప్ర‌భుత్వ స్థలాన్ని లీజ్‌కు తీసుకోవాల‌ని భావిస్తున్నారు. ఆ స్థలంలో వెయ్యి వాహ‌నాలు నిలిపేలా పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించడంతో పాటు అక్కడే హైద‌రాబాద్ జిల్లా పార్టీ కార్యాల‌యాన్ని కూడా నిర్మాంచాలని యోచిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ భ‌వ‌న్ లో త్వరలో క్యాంటీన్ స‌దుపాయం అందుబాటులోకి రాబోతోంది. ఇప్ప‌టికే క్యాంటిన్ నిర్మాణ ప‌నులు చురుగ్గా సాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories