Top
logo

నాలుగు ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌ కైవసం

నాలుగు ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌ కైవసం
Highlights

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి...

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఒకరు గెలుపొందారు. ఓటింగ్‌కు కాంగ్రెస్‌ సహా విపక్షాలు దూరంగా ఉండటంతో ఐదుగురు అభ్యర్థుల ఎన్నిక లాంఛనమైంది. ఐదు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో టీఆర్ఎస్‌ నుంచి మహమూద్‌ అలీ, శేరి సుభాష్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎగ్గె మల్లేశం గెలుపొందగా.. మజ్లిస్‌ నుంచి మీర్జా రియాజ్‌ హసన్‌ విజయం సాధించారు. పోలింగ్‌లో టీఆర్ఎస్‌కు చెందిన 91 మంది, ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తొలి ఓటు వేయగా సీఎం కేసీఆర్ చివరి ఓటు వేశారు. ఇరువురు నేతలు శేరి సుభాష్ రెడ్డికే వేశారు. మొత్తం 98 ఎమ్మెల్యేల్లో ముగ్గురు అభ్యర్ధులకు 20 మంది చొప్పున తొలి ప్రాధాన్యత ఓటు వేయగా మిగిలిన ఇద్దరు అభ్యర్ధులకు 19 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వేశారు.


లైవ్ టీవి


Share it
Top