కౌన్ బ‌నేగా మల్కాజిగిరి ఎంపీ ? గెలుపుపై టీఆర్ఎస్, కాంగ్రెస్‌ ధీమా!

కౌన్ బ‌నేగా మల్కాజిగిరి ఎంపీ ? గెలుపుపై టీఆర్ఎస్, కాంగ్రెస్‌ ధీమా!
x
Highlights

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాగా గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 73.20 శాతం పోలింగ్‌ నమోదవగా...

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాగా గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 73.20 శాతం పోలింగ్‌ నమోదవగా తాజా ఎన్నికల్లో 12.63 శాతం తగ్గింది. 62.25 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. ఇక అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నిక్షిప్తమైంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు అందరి దృష్టి మల్కాజిగిరి స్థానంపై ఎందుకంటే అక్కడే పోటీలో ఉంది కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, అధికార పార్టీ టీఆర్ఎస్ నుండి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి పోటీలో ఉన్నందుకే ఇక్కడి నియోజకవర్గంపై అంత ఆసక్తి.

ఇక మల్కాజిగిరి గడ్డపై టీఆర్ఎస్ జెండా ఎగురుతుందని, ఇటు కాంగ్రెస్‌ సైతం ఈసారి చేయ్యి గుర్తు రేపరేపలాడుతుందని ఇరూ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం తగ్గడం తమకే కలిసొస్తుందంటూ ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. అయితే టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం అభ్యర్ధి కంటే సీఎం కేసీఆర్ ముఖం చేసి ఓట్లు పడుతాయని ఖచ్ఛితంగా భారీ మెజారీటితో మర్రి రాజశేఖర్‌రెడ్డి గెలుపు ఖాయమంటూ టీఆర్ఎస్ శ్రేణులు గల్ల ఎగరేసి చెబుతున్నారు. అయితే ఇటు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుక లేకపోతే ఇష్టరాజ్యంగా మారుతుందని తప్పకుండా ప్రజలు రేవంత్‌రెడ్డి ఆశ్వీర్వదించి అత్యధిక మెజరిటీతో మల్కాజిగిరి స్థానంపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు.

అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా రేవంత్‌రెడ్డిని మల్కాజిగిరి అభ్యర్ధిగా ఎన్నికల రణరంగంలోకి దించింది. దీంతో అధికార పార్టీ టీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని ఢీకొట్టేందుకు సామాజిక వర్గానికి చెందిన మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డిని దించింది. ఇక ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యనే నెలకొంది. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి తెరాసలో చేరారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సరైన కార్యకర్తలు లేకపోవడం పోలింగ్‌ రోజు మాకు కలిసొచ్చిందని అంటున్నారు. బస్తీలు, కాలనీల్లో నివాసముండే పేదలు, మధ్య తరగతి ప్రజల్లో 90 శాతం మిగిలిన వర్గాల్లోనూ 70 శాతానికి పైగా మావైపే నిలిచారని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇక ఎలాగైన మంచి మెజార్టీతో గులాబీ జెండా ఎగరడం ఖాయం అని తెరాస శ్రేణులు పేర్కొంటున్నాయి.

ఇక కాంగ్రెస్ పార్టీ తరుఫున చూసుకున్నట్లైయితే అసలు ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వైపు ముఖ్యనేతలెవరూ తొంగి చూడలేదు. అన్నీ తానై రేవంత్‌రెడ్డి తన భూజాల మీద వేసుకొని ప్రచారం జోరుగాసాగించాడు. మర్రి రాజశేఖర్‌రెడ్డి ఎంపికపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రవ్యతిరేకతతో రేవంత్ రెడ్డికి కలిసి వస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం తగ్గడం అంతిమంగా తెరాసకే నష్టం అంటున్నారు. తెలుగుదేశం పార్టీతో పాటు కొన్ని ఇతర పార్టీలు అండగా నిలవడం కూడా కలిసి వచ్చింది. కాగా ఈ లోక్‌సభ ఎన్నికలు రాష్ట్రానికి , దేశానికి సంబంధించినవని అనుభవజ్ఞుడికి మద్దతు తెలిపితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని మల్కాజిగిరివాసులు గుర్తించారు. ఓటర్లు మాత్రం స్వచ్ఛందంగా మాకు మద్దతు తెలిపారని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు రేవంత్‌రెడ్డి గెలుపుపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories