పెండింగ్ చలాన్లు ఉంటే వెంటనే కట్టేయండి...లేకపోతే....

పెండింగ్ చలాన్లు ఉంటే వెంటనే కట్టేయండి...లేకపోతే....
x
Highlights

మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారా..? మీరు కట్టాల్సిన చలాన్ లు పెండింగ్ లో ఉన్నాయా..? అయినా రోడ్డుపై దూసుకుపోతున్నారా ? పరిస్థితులు మారాయి....

మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారా..? మీరు కట్టాల్సిన చలాన్ లు పెండింగ్ లో ఉన్నాయా..? అయినా రోడ్డుపై దూసుకుపోతున్నారా ? పరిస్థితులు మారాయి. చలాన్ లు వెంటనే కట్టేయండి లేకుంటే కోర్టు మెట్లు ఎక్కాల్సివస్తుంది.

హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి చలానాలు చెల్లించకుండా తిరుగుతున్న వారి ఆటలు ఇక చెల్లవు. చలాన్లు చెల్లించినవారిపై ట్రాఫిక్ పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. చార్జీషీట్ దాఖలు చేసి కటకటాల్లోకి పంపిస్తున్నారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిని ఆయా చోట్ల ఉండే ట్రాఫిక్ పోలీసులు కెమెరా ద్వారా ఫోటో తీస్తున్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన కెమెరాలను పరిశీలిస్తున్నారు. రెడ్ సిగ్నల్ క్రాస్ చేసి పోవడం, హెల్మెట్ లేకపోవడం, రాంగ్ రూట్ లో ప్రయాణం తదితర ట్రాఫిక్ తప్పిదాలకు చలాన్లు విధిస్తున్నారు. వాహనదారుడికి సెల్ ఫోన్ కు మెసెజ్ పంపిస్తున్నారు. ఇంటికి పోస్టు ద్వారా ఫైన్ వివరాలను పంపిస్తున్నారు. కొందరు వాహనదారులు వెంటనే చలాన్లు చెల్లిస్తే, మరికొంత మంది చలానా కట్టకుంటే ఏమవుతుందని రోడ్డుపైకి దూసుకొస్తున్నారు.

ట్రాఫిక్ రూల్స్ అధిగమించేవారిసంఖ్యతో పాటు చలాన్లు చెల్లించనివారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల నగరంలో ట్రాఫిక్ పోలీసులు రెండు రోజుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అబిడ్స్ లో ఓ బైక్ పై ఒకటి రెండు కాదు ఏకంగా 105 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. 16, 390 రూపాయల ఫైన్ కట్టాల్సి ఉంది. 2016 నుంచి చలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించారు. బైక్ ను సీజ్ చేశారు. వాహనదారుడిపై చార్జీషీట్ దాఖలు చేసి కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. అలాగే ఓ ట్యాక్సీపై 104 చలాన్లు పెండింగ్ లో ఉండగా, 17, 805 రూపాయలు ఫైన్ ఉండడాన్ని గుర్తించారు. ట్యాక్సీ డ్రైవర్ ను కోర్టులో ప్రవేశపెట్టారు.

ఎక్కువ చలాన్లు పెండింగ్ లో ఉన్న వాహనాలను స్పెషల్ ట్రాఫిక్ టీమ్ లు పర్సనల్ డిజిటల్ అసిస్టెంల్ ద్వారా గుర్తించి పట్టుకుంటారు. నాలుగు చలాన్ల లోపు పెండింగ్ లో ఉంటే ఈ సేవలో కట్టామని చెబుతారు. పది చలాన్లు కంటే అధికంగా ఉంటే వాహనాన్ని సీజ్ చేస్తారు. ఆన్ లైన్ లేదా బ్యాంక్ లో వాహనదారుడు చలానా డబ్బులు కట్టిన వెంటనే ఇచ్చేస్తారు.

చలాన్లు ఎప్పుడైనా కట్టాల్సిందేనని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. వాహనం విక్రయించేటప్పుడు లేదా ఎక్చేంజ్ చేసేటప్పుడు చలాన్ల పెండింగ్ విషయం బయటపడుతుందని, కనుక చలాన్లు చెల్లించడం బెస్ట్ అని ట్రాఫిక్ పోలీసు అధికారులు సూచిస్తున్నారు. చలాన్ల విషయంలో రాజకీయ నాయకులు, వీఐపీలపై వివక్ష చూపించమని, అందరూ చలాన్లు కట్టాల్సిందేనని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories